దేశం లోని అన్ని ప్రైవేట్ స్థలాలలో అంటే షాపింగ్ మాల్స్, కార్పోరేట్ ఆఫీసులు, స్కూల్ లూ, కాలేజీ లు ఇలా అన్నింటిలోనూ వైఫై సౌకర్యాన్ని ఆయా సంస్థలు అందిస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో ప్రభుత్వం కూడా పయనించబోతోంది. రైల్వే స్టేషన్ ల లో వై ఫై సౌకర్యాన్ని గురించి మనం క్రితం ఆర్టికల్స్ లో చదివాము. ఇపుడు ఢిల్లీ హై కోర్ట్ లో కూడా వైఫై తో కనెక్ట్ చేయబడుతున్నాయి. ఢిల్లీ రాష్ట్త్రం లోని ఆరు హై కోర్ట్ లలో రానున్న మూడు నెలల్లో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోనికి తీసుకురానున్నారు. దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరం లోని డిస్ట్రిక్ట్ కోర్ట్ లలో వైఫై సదుపాయాన్ని సంయుక్తంగా ఇన్ స్టాల్ చేయవలసిందిగా ప్రముఖ టెలికాం ఆపరేటర్ లు అయిన ఎయిర్ టెల్ మరియు వోడాఫోన్ లకు ఆదేశాలు అందాయి. భారత సుప్రీం కోర్ట్ మరియు ఢిల్లీ హై కోర్టు లు కూడా తమ ప్రాంగణాలలో వైఫై సేవలను అందిస్తుండడంతో ఢిల్లీ లోని అన్ని డిస్ట్రిక్ట్ కోర్టు లు కూడా ఇప్పుడు అదే బాటలో నడవనున్నాయి. జనవరి చివరి లో ఢిల్లీ హై కోర్ట్ ప్రాంగణం లో వైఫై సేవలను ప్రారంభించారు. ఈ ఉత్సాహం తోనే ఢిల్లీ లోని ఆరు డిస్ట్రిక్ట్ కోర్టు లలో అతి త్వరలోనే ఈ సేవలను ప్రారంభించనున్నారు. ఈ వై ఫై సౌకర్యాన్ని ఉపయోగించి కోర్టు పరిసరాలైన ఛాంబర్ బ్లాకు లు, లాబీలు,కారిడార్ లు , క్యాంటీన్, లైబ్రరీ, బార్ రూమ్ లూ ఇలా అన్ని పబ్లిక్ ప్రదేశాలలోనూ ప్రజలు ఇంటర్ నెట్ ను ఉపయోగించుకోవచ్చు. ఢిల్లీ కి చెందిన ఆ ఆరు కోర్టు లు ఏమిటంటే
ఎయిర్ టెల్ మరియు వోడా ఫోన్ వినియోగ దారులు తమ దాటా ప్యాక్ లనుండి ప్రత్యెక వైఫై ప్యాకేజి లను ఎంచుకోవచ్చు. మిగతా వినియోగదారులు తమ తమ కంపెనీల ప్రకారం 20 రూపాయలనుండి 270 రూపాయల వరకూ డేటా వోచర్ లను పొందవచ్చు. ఈ సౌకర్యం నాన్ సిమ్ కార్డు పరికరాలైన లాప్ ట్యాప్ లూ, ట్యాబు లేట్ లో కూడా అందుబాటులో ఉంటుంది. |