• తాజా వార్తలు

బి అలర్ట్ : ట్రాఫిక్ రూల్స్, పెనాల్టీ లిస్ట్ వచ్చేసింది, పూర్తి వివరాలు మీకోసం

మోటార్ వెహికిల్స్ యాక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 108, వ్యతిరేకంగా 13 ఓట్లు రాగా ఈ బిల్లుపై పలు రాష్ట్రాల ఆందోళనల చేశాయి. అయినప్పటికీ నితిన్ గడ్కరీ వాటిని తోసిపుచ్చారు. కొత్తగా వచ్చిన సవరణల ప్రకారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడినవారికి రూ.2.5 లక్షలను నిందితుడు చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చిన పెనాల్టీ లిస్టు వివరాలపై ఓ లుక్కేయండి. 

హిట్ అండ్ రన్ కేసు
హిట్ అండ్ రన్ కేసులో ఇప్పటివరకు పరిహారం రూ.25,000గా ఉంది. దీనిని రూ.2 లక్షలకు పెంచారు. గాయాలపాలైన వారికి ఇదివరకు రూ.12,500 చెల్లించగా, ఇప్పుడు రూ.25,000 చెల్లించాల్సి ఉంటుంది. గోల్డెన్ హవర్‍‌లో రోడ్డు ప్రమాద బాధితులకు డబ్బులు లేకుండానే చికిత్స జరిగే విధంగా కేంద్రం ఓ స్కీం రూపొందిస్తోంది. ప్రమాదం జరిగిన ఒక గంట సేపటి నుంచి దీనిని పరిగణిస్తారు. అలాగే, రోడ్డు ప్రమాదల కేసుల్లో కంపన్షేషన్ క్లెయిమ్ కోసం ప్రమాదం జరిగిన నాటి నుంచి ఆరు నెలలు ఎక్స్‌పైరీ డేట్‌గా ప్రతిపాదించారు.

ట్రాఫిక్ కొత్త పెనాల్టీలు
మోటార్ వెహికిల్స్ చట్టం సవరణల అనంతరం కొత్త పెనాల్టీలు ఇలా ఉంటాయి.
జనరల్ (177)- రూ.500 - రహదారి ఉల్లంఘన నియమాలు (new 177A) - రూ.Rs 500 - టిక్కెట్ లేకుండా ప్రయాణం (178)- రూ.Rs500 - అధికారుల పట్ల దురుసు ప్రవర్తన (179)- రూ. 2000 - లైసెన్స్ లేకుండా వాహనాలను అనధికారికంగా ఉపయోగించడం (180) - రూ.5000 - లైసెన్స్ లేకుండా వాహనం నడపడం (181)- రూ.5000 - అర్హత లేని డ్రైవింగ్ (182) రూ.10,000 - ఓవర్ టేక్ (182B)- రూ.5000 - ఓవర్ స్పీడ్ (183)- లైట్ మోటార్ వెహికిల్స్‌కు రూ.1000, మీడియా ప్యాసింజర్, హెవీకి రూ.2000 - డేంజరెస్ డ్రైవింగ్ (184) - రూ.5000 వేల వరకు - డ్రంకన్ డ్రైవింగ్ (185)- రూ.10,000 - స్పీడింగ్/రేసింగ్ (189)- రూ.5,000 - పర్మిట్ లేని వాహనం (192A)- రూ.10,000 వరకు - అగ్రిగేటర్స్(లైసెన్స్ నిబంధనల ఉల్లంఘన) (193) - రూ.25,000 నుంచి రూ. 1,00,000 వరకు - ఓవర్ లోడింగ్ (194) - రూ.20,000, అలాగే, ప్రతి అదనపు టన్నుకు రూ.2,000 - ప్రయాణీకుల ఓవర్ లోడింగ్ (194A) - ప్రతి అదనపు ప్రయాణీకుడికి రూ.1000 - సీటు బెల్టు (194 B) - రూ. 1,000 - టూవీలర్ ఓవర్ లోడింగ్ (194 C)- రూ.2,000 మరియు 3 నెలల పాటు లైసెన్స్ డిస్‌క్వాలిఫికేషన్ - ఎమర్జెన్సీ వెహికిల్స్‌కు దారి ఇవ్వకపోవడం (194E) - రూ.10,000 - లైసెన్స్ లేని డ్రైవింగ్ (196) - రూ.2,000 -జువైనైల్స్ అఫెన్స్ (199) - గార్డియన్ లేదా యజమానికి రూ.25,000 జరిమానా మరియు 3 నెలల జైలు శిక్ష. మోటార్ వెహికిల్స్ రిజిస్ట్రేషన్ రద్దు. చిన్నారులపై జువైనల్ చట్టం ప్రకారం విచారణ
 

జన రంజకమైన వార్తలు