• తాజా వార్తలు

శుభవార్త, త్వరలో ATM ఛార్జీలు తగ్గనున్నాయి 

ATM (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్) ఇంటర్‌చేంజ్ ఫీజు ఛార్జీలను తగ్గించాలని చాలామంది కోరుకుంటున్నారు. వారి ఆశలకు అనుగుణంగా రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది.  ఏటీఎం ఛార్జీలు తగ్గించే అంశంపై ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) త్వరలో ఓ కమిటీని వేయనుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడి సందర్బంగా ఆర్‌బీఐ ఈ సంకేతాలిచ్చింది. ఇందులో రెపో రేటు పావు శాతం తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 6 శాతం రెపో రేటు 5.75 శాతానికి చేరుకుంది. రివర్స్‌ రెపో రేటు, బ్యాంక్‌ రేటును వరుసగా 5.50శాతం, 6శాతానికి సవరించింది. ఈ సందర్భంగా ఏటీఎం ఛార్జీల అంశంపై స్పందించింది.

ఏటీఎంల ఉపయోగం క్రమంగా పెరుగుతోందని, ఏటీఎం ఛార్జీలు, ఫీజులు సమీక్షించాలనే డిమాండ్స్ ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఓ కమిటీని వేయాలని నిర్ణయించామని ఆర్బీఐ తెలిపింది. ఇందులో స్టేక్ హోల్డర్స్‌కు చోటు కల్పిస్తామన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ కమిటీ తమ సూచనలను, సలహాలను తమ మొదటి సమావేశం తర్వాత... రెండు నెలల్లో ఇవ్వాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఆ కమిటీ ఇచ్చిన సూచనలకు ఆ తర్వాత వారం రోజుల్లో కూర్పు తీసుకు వస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా, 2010 జులై తర్వాత రెపో రేటు 5.50 శాతంగా ఉండగా ఆ తర్వాత ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇప్పుడే. వడ్డీరేట్ల తగ్గింపుతో స్టాక్‌ మార్కెట్లలో బ్యాంకింగ్ షేర్లు కుదేలయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌ తదితర షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అయ్యాయి.

నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌ల ద్వారా చేపట్టే ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌లపై చార్జీలను తొలగించడంతో ఈ లావాదేవీలు ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్‌బీఐ ఏటీఎం చార్జీల విషయంలో కూడా బ్యాంకు ఖాతాదారులకు భారీ  ఊరట నివ్వబోవడం విశేషం. ఏటీఎం ఛార్జీల అంశంపై స్పందించిన ఆర్‌బీఐ ఏటీఎంల ఉపయోగం క్రమంగా పెరుగుతోందని, ఏటీఎం ఛార్జీలు, ఫీజులు సమీక్షించాలనే డిమాండ్స్ ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఓ కమిటీని వేయాలని నిర్ణయించామని తెలిపింది. 
 

జన రంజకమైన వార్తలు