ఎవరైనా విజిటింగ్ కార్డ్ ఇస్తే దాన్ని పర్స్‌లో పెట్టుకునవాళ్లం. వాళ్లకు కాల్ చేయాల్సి వస్తే ఆ నెంబర్ చూసి డయల్ చేసేవాళ్లం. లేకపోతే ఆ నెంబర్ ఫోన్ డైరెక్టరీలో రాసి పెట్టుకునేవాళ్లం. సెల్‌ఫోన్లు వచ్చాక అందులో నెంబర్‌ను కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక ఆ అవసరం కూడా లేదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో అడోబ్ స్కాన్ యాప్‌తో విజిటింగ్ కార్డ్‌ను స్కాన్ చేస్తే చాలు అందులో ఉన్న ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలను ఫోన్ కాంటాక్ట్స్‌గా సేవ్ చేసేసుకోవచ్చు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో
మైక్రోసాఫ్ట్ తన అడోబ్ స్కాన్‌ను ఈ నెల 19న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో అప్‌డేట్ చేసింది.
* అడోబ్ స్కాన్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయండి.
* యాప్ ఓపెన్ చేశాక మీ అడోబ్ అకౌంట్ లేదా ఫేస్‌బుక్ లేదా జీమెయిల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అవ్వండి.
* యాప్‌లో ఉండే ఇన్‌బిల్ట్ కెమెరాతో ఏదైనా విజిటింగ్ కార్డ్‌ను స్కాన్ చేయండి. యాప్ దాన్ని క్రాప్ చేసి సేవ్ చేస్తుంది.
* ఇప్పుడు అడోబ్ స్కాన్ యాప్.. టెక్స్ట్ రికగ్నైజేషన్ ప్రాసెస్ ప్రారంభిస్తుంది.
* యాప్‌లో ఉండే Sensei A.I.మీరు స్కాన్ చేసిన విజిటింగ్ కార్డ్‌ను డిటెక్ట్ చేస్తుంది. save to contacts బటన్‌ను టాప్ చేస్తే ఆ కార్డ్‌లో ఉన్న ఇన్ఫో (ఫోన్ నెంబర్, పేరు, ఈమెయిల్ ఐడీ) అంతా మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో సేవ్ అవుతుంది.
కోటి డౌన్‌లోడ్స్
ఏడాది కిందట అడోబ్ రిలీజ్ చేసిన ఈ యాప్ ఇప్పటికే దాదాపు కోటి డౌన్‌లోడ్స్ దాటింది. దీనిలో కొత్తగా వచ్చిన ఈ ఏఐ అప్‌డేట్ మీరు స్కాన్ చేసే విజిటింగ్ కార్డ్‌లోని ఇన్ఫోను ఫోన్ కాంటాక్ట్స్‌లో సేవ్ చేస్తుంది.