• తాజా వార్తలు

బ‌డ్జెట్ ధ‌ర‌లో సూప‌ర్ ఫీచ‌ర్లతో  శాంసంగ్ గెలాక్సీ ఎం 12 

శాంసంగ్ ఇండియ‌న్ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్ మోడ‌ల్‌ను రిలీజ్ చేసింది.  శాంసంగ్ గెలాక్సీ ఎం12 పేరుతో రిలీజ‌యింది.  
బ‌డ్జెట్ ధ‌ర‌లోనే మంచి ప్రాసెస‌ర్‌, బిగ్‌ బ్యాట‌రీ. సూప‌ర్ కెమెరా దీని ప్ర‌త్యేక‌త‌లు.  దీని ధ‌ర 10, 999 నుంచి ప్రారంభం. ఇదే ప్రైస్ రేంజ్‌లో ఉన్న‌ రియల్‌మీ నార్జో 30ఏ, రెడ్‌మీ నోట్ 10, పోకో ఎం3 లాంటి మోడల్స్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎం12 పోటీప‌డ‌బోతోంది. అయితే  రియ‌ల్‌మీ, రెడ్‌మీ కంటే శాంసంగ్ బ్రాండ్ వాల్యూ, వినియోగ‌దారుల‌కు న‌మ్మ‌కం ఎక్కువ కాబ‌ట్టి ఈ ఫోన్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్ప‌డుతుంద‌ని అంచ‌నా.

ఇవీ శాంసంగ్ గెలాక్సీ ఎం12 స్పెక్స్‌
* 6.5 ఇంచెస్  హెచ్‌డీ ప్ల‌స్ టీఎఫ్‌టీ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లే  

* శాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్ 

* ఆండ్రాయిడ్ 11 + వన్‌యూఐ 3.1 కోర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 

* 4జీబీ / 6జీబీ ర్యామ్‌

* 64 జీబీ / 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌

కెమెరా
ఈ ఫోన్‌లో నాలుగు వెనుక‌వైపు నాలుగు కెమెరాల సెట‌ప్ ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ , 5 మెగాపిక్సెల్ సెకండ‌రీ అల్ట్రావైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ , 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 

బ్యాట‌రీ
6,000ఎంఏహెచ్ బ్యాటరీ 

ధ‌ర‌
శాంసంగ్ గెలాక్సీ ఎం12   4జీబీ ర్యామ్ ,  64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వేరియంట్  ‌ధర రూ.10,999

* 6జీబీ ర్యామ్,  128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వేరియంట్  ‌ధర రూ.13,499

*  ఈ రోజు నుంచి అమెజాన్ , శాంసంగ్ వెబ్‌సైట్ల‌లోనూ, రిటైల్ స్టోర్లలోనూ ల‌భిస్తుంది. 

*  లాంచింగ్ ఆఫర్‌గా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.1,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు
 

జన రంజకమైన వార్తలు