లాక్‌డౌన్‌తో చాలామందికి డబ్బుల కొరత వచ్చిపడింది. చాలా పెద్ద పెద్ద కంపెనీలే జీతాల్లో కోత విధిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు నెల జీతం ఒకటో తేదీ రెండో తేదీన వేయకుండా 10, 15 రోజులు ఆగాక చూద్దామని చెబుతున్నా్యి. ఈ పరిస్థితుల్లో మారటోరియం వల్ల ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లలు కట్టడానికి ఇంకో నెల టైమ్ ఉంది. కానీ ఈలోగా ఏదైనా వస్తువు కొనాల్సి వస్తో, ఫోనో, ఫ్యానో పాడైతే.. ఉప్పులూ, పప్పులూ కొనుక్కోవాల్సి వస్తే.. అందుకే దీనికి అమెజాన్ ఓ మంచి ఉపాయంతో వచ్చింది. అమెజాన్ పే లేటర్ సర్వీస్‌ను ప్రారంభించింది. కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పులు ఇస్తామని ముందుకు వచ్చింది.
నిత్యావసర వస్తువుల కొనుక్కోవడానికే
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన భారతీయ కస్టమర్లకు శుభవార్త ప్రకటించింది. ఇండియాలో అమెజాన్ పే లేటర్ క్రెడిట్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పులు ఇస్తుంది. అయితే ఇది అమెజాన్ ఇండియాలో కొన్ని ప్రోడక్ట్స్‌కి మాత్రమే వర్తిస్తుంది. ముఖ్యంగా నిత్యావసరాలకు చేతిలో డబ్బులు లేకపోయినా అమెజాన్ పే లేటర్ ద్వారా కొనుక్కోవచ్చు. గడువులోగా కట్టేస్తే వడ్డీ కూడా ఉండదు.
ఈఎంఐగానూ మార్చుకోవచ్చు
గడువులోగా మీకు డబ్బు చేతికి అందలేదా? అయినా పర్లేదు. మీ ట్రాన్సాక్షన్ అమౌట్‌ను ఈఎంఐగా మార్చకోవచ్చు. గరిష్టంగా 12 నెలల వరకూ ఈఎంఐ పెట్టుకోవచ్చు. ఈఎంఐకి మాత్రం 1.5 నుంచి 2 శాతం వరకు వడ్డీ కట్టాలని అమెజాన్ ప్రకటించింది.
అందరికీ ఇస్తారా?
* అమెజాన్ ఇండియా యాప్‌లో రిజిస్టరయిన కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ ఇస్తున్నారు.
* అమెజాన్ అకౌంట్ లేనివారు కొత్తగా డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు.
* రూపాయి నుంచి 60 వేల వరకు లిమిట్ ఉంటుంది.
* అత్యవసర వేళ ఇది కూడా ఓ అవకాశం.. దృష్టిలో పెట్టుకోండి. అవసరమైతే వాడుకోండి.
ప్రస్తుతానికి యాప్‌లోనే
ప్రస్తుతానికి అమెజాన్ మొబైల్ యాప్‌లో మాత్రమే ఈ అమెజాన్ పే లేటర్ ఫీచర్ అందుబాటులో ఉంది. డెస్క్‌టాప్ సపోర్ట్ ఇంకా ఇవ్వలేదు. యాప్‌లోని అమెజాన్ పే డ్యాష్‌బోర్డుకు వెళ్లి అమెజాన్ పే లేటర్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు