అత్యుత్తమ సెక్యూర్, మరియు సెన్సిటివ్ డేటా ను అందించడానికి గూగుల్ ప్రాజెక్ట్ వాల్ట్ ను అనౌన్సు చేసింది. గూగుల్ I/o డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో దీనిని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ వాల్ట్ అనేది ఒక సింపుల్ మైక్రో ఎస్ డి కార్డు రూపం లో ఉండే ఒక ఎన్ క్రిప్టేడ్ కంప్యూటర్. ఇది మైక్రో ఎస్ డి కార్డు ను సపోర్ట్ చేసే ఏ డివైస్ కైనా కంపాటిబుల్ అయి ఉంటుంది. ఇది గూగుల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ప్రాజెక్ట్స్ గ్రూప్ చే డిజైన్ చేయబడింది. ఇది కనెక్ట్ చేయబడి ఉన్నపుడు ఈ ప్రాజెక్ట్ వాల్ట్ ఆ డివైస్ నుండి జరిగే అన్ని రకాల కమ్యూనికేషన్ లనూ సెక్యూర్ చేస్తుంది.
ఇది చూడడానికి మామూలు మైక్రో ఎస్ డి కార్డు లానే ఉంటుంది. అయితే ఇది ఒక ARM ప్రాసెసర్ ద్వారా పవర్ చేయబడి ఉంటుంది. సెక్యూర్ RTOS ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. ఇది ఒక ఆంటిన్నా, NFC, 4 GB సీల్డ్ ఇంటర్ నల్ స్టోరేజ్ మరియు ఒక సూట్ క్రిప్టో గ్రాఫిక్ సర్వీస్ లతో వస్తుంది. రెండు వాల్ట్ ప్రొటెక్టెడ్ డివైస్ ల మధ్య ఇది సెక్యూర్ కమ్యూనికేషన్ ను ఎనేబుల్ చేస్తుంది. ఇది మెసేజ్ ను ఎన్ క్రిప్ట్ చేసి కొన్ని స్థాయిల్లో అతెంటికేషన్ ను యాడ్ చేస్తుంది. ఈ చిప్ మీ డివైస్ ను ఒక పాస్ వర్డ్ లాగా కన్వర్ట్ చేసి ఏదైనా ఆన్ లైన్ సర్వీస్ లను ఉపయోగించేతపుడు మీ డివైస్ కు అతెంటికేషన్ ను కల్పిస్తుంది.
ఇది ఒక స్టాండర్డ్ ఫైల్ సిస్టం రీడ్ అండ్ రైట్ తో కూడిన జెనరిక్ స్టోరేజ్ యూనిట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి సులభంగా ఇంటిగ్రేట్ అవ్వగలుగుతుంది. ఈ వాల్ట్ యొక్క ఫస్ట్ వెర్షన్ లో భాగంగా గూగుల్ ఒక ఓపెన్ సోర్సు డెవలప్ మెంట్ కిట్ ను కూడా రిలీజ్ చేసింది.