• తాజా వార్తలు

128 జీబీ ర్యామ్‌, 6టీబీ స్టోరేజ్‌తో వ‌చ్చిన తొలి ల్యాప్‌టాప్.. లెనోవో థింక్‌ప్యాడ్ పీ52

8జీబీ ర్యామ్‌తో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుంద‌ని మ‌నం ఎప్పుడైనా అనుకున్నారా?  కానీ ఇప్పుడు అది సాధ్య‌మైంది. అలాగే ఏకంగా 128 జీబీ ర్యామ్‌తో ల్యాప్‌టాప్ వ‌స్తుంద‌ని ఊహించారా? అదీ సాధ్యం చేసింది లెనోవో. 128 జీబీ ర్యామ్ మాత్ర‌మే కాదు 6టీబీ భారీ స్టోరేజ్ కెపాసిటీతో లెనోవో థింక్‌ప్యాడ్ పీ 52 (Lenovo ThinkPad P52) ల్యాపీని రిలీజ్ చేసింది. ఆ భారీ స్పెక్స్ ల్యాపీ మీద లుక్కేసి వ‌ద్దాం ప‌దండి..

ప‌వ‌ర్‌ఫుల్ పెర్‌ఫార్మెన్స్ కోసం
చైనీస్ కంపెనీ లెనోవో.. లెనోవో థింక్‌ప్యాడ్ పీ52 ల్యాప్‌టాప్‌ను నెక్స్ట్ బిల్డ్ కాన్ఫ‌రెన్స్‌లో రీసెంట్‌గా రివీల్ చేసింది. థింక్‌ప్యాడ్ లైన‌ప్‌లో ఇప్ప‌టికే 9 మోడ‌ల్స్ లాంచ్ చేసిన లెనోవో ప‌దో మోడ‌ల్‌గా థింక్‌ప్యాడ్ పీ52ను ప్ర‌క‌టించింది. వీఆర్ క్యాప‌బిలిటీస్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లో 128 జీబీ ర్యామ్‌, 6 టీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.  1920x1080 పిక్సెల్ రిజ‌ల్యూష‌న్ డిస్‌ప్లేతో 15.6 ఇంచెస్ 4కే ట‌చ్ స్క్రీన్ దీని సొంతం. 8వ జ‌న‌రేష‌న్ ఇంటెల్ జియాన్ హెక్సా కోర్ ప్రాసెస‌ర్‌, న్విడియా క్వాడ్రో పీ3200 జీపీయూ క‌లిసి ఈ ల్యాపీకి ప‌వ‌ర్‌ఫుల్ పెర్‌ఫార్మెన్స్ ఇస్తాయి. బ‌రువు 2.5 కిలోలు. 

ఇత‌ర  ఫీచ‌ర్లు
* యూఎస్‌బీ 3.1 టైప్ ఏ,  యూఎస్‌బీ -సి/ థ‌ండ‌ర్‌బోల్ట్ పోర్టులు 2 ఉండ‌డంతో యూనిర్స‌ల్ ఛార్జింగ్‌కు 

* ఒక హెచ్‌డీఎంఐ 2.0 పెఓర్ట్‌, ఒక మినీ డిస్‌ప్లే పోర్ట్‌

* ఎస్డీ కార్డ్ రీడ‌ర్‌

* వైఫై, బ్లూటూత్‌, 4జీ ఎల్టీఈ క‌నెక్టివిటీ 

* ఫేషియ‌ల్ రికగ్నైజేష‌న్ కోసం ఇన్‌ఫ్రారెడ్ కెమెరా

* క్వాలిటీ వీడియో కాలింగ్ కోసం హెచ్‌డీ వెబ్‌కామ్‌

5 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌
విండోస్ 10 ప్రో ఫ‌ర్ వ‌ర్కింగ్‌స్టేష‌న్‌, విండోస్ 10 ప్రో, విండోస్ 10హోం, ఉబున్టు, లిన‌క్స్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌తో ఈ ల్యాపీ ప‌ని చేస్తుంది. లెనోవో వాంటేజ్‌, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2016 ట్ర‌య‌ల్‌ను ఈ ల్యాప్‌టాప్‌లో ప్రీ ఇన్‌స్టాల్ చేశారు. ధ‌ర ఎంతనేది ఇంకా ప్ర‌క‌టించలేదు. లెనోవో థింక్‌ప్యాడ్ సిరీస్ ల్యాపీలు 54వేల నుంచి ప్రారంభ‌మ‌వుతున్నాయి. కానీ వాటికంటే చాలా ఎక్కువే ఉండొచ్చ‌ని అంచనా.

జన రంజకమైన వార్తలు