• తాజా వార్తలు

ప్రివ్యూ - ఎంఎస్ ఆఫీస్ 2019కి తొలి ప్రివ్యూ మీకోసం..

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్‌.. ఎంఎస్ ఆఫీస్ 2019ను మార్కెట్లోకి తీసుకొచ్చే  దిశ‌గా తొలి అడుగు వేసింది. విండోస్ 10 వాడుతున్న వారికి ఎంఎస్ ఆఫీస్ 2019 వెర్ష‌న్ ఫ‌స్ట్ ప్రివ్యూను టెస్టింగ్ కోసం రిలీజ్ చేసింది. పూర్తిగా కమ‌ర్షియ‌ల్ ప‌ర్ప‌స్‌తోనే దీన్ని శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఆ ప్రివ్యూ తొలిసారిగా మీకోసం..

ఎంఎస్ ఆఫీస్ 2019 ప్రివ్యూను ఎక్స్‌క్లూజివ్‌గా విండోస్ 10 యూజ‌ర్ల‌కే రిలీజ్‌చేస్తున్న‌ట్లు మైక్రోసాఫ్ట్ ప్ర‌క‌టించింది. ఈ ప్రివ్యూ Win32 (x86) సిస్ట‌మ్స్‌కే ప‌నిచేస్తుంది. ఈ ఏడాది డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు వీరంద‌రికీ ప్రివ్యూ అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది జూన్ త‌ర్వాత ఎప్పుడ‌యినా క‌మ‌ర్షియ‌ల్‌గా అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి,.

ఏమేం ఉన్నాయి?
 ఆఫీస్ 365 సాఫ్ట్‌వేర్‌లో ఉన్నఫీచ‌ర్ల‌న్నీ ఎంఎస్ ఆఫీస్ 2019లో కూడా ఉన్నాయి,. వ‌ర్డ్, ఎక్సెల్‌, ప‌వ‌ర్‌పాయింట్‌, అవుట్‌లుక్‌, ప‌బ్లిష‌ర్‌, యాక్సెస్‌, ప్రాజెక్ట్, విజియో, వ‌న్ నోట్ వంటి ఫీచ‌ర్ల‌న్నీ ఉన్నాయి. వీటిలో వ‌న్ నోట్ ఫ‌స్ట్ యూనివ‌ర్స‌ల్ విండోస్ ఫ్లాట్‌ఫామ్ (UWP) ఓన్లీ యాప్‌గా ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులోకి తెచ్చారు. 
హైలెట్స్‌
*మోస్ట్ ప్రొడ‌క్టివ్, మోస్ట్ సెక్యూర్డ్ ఆఫీస్ ఎక్స్‌పీరియ‌న్స్ కోసం  ఎంఎస్ ఆఫీస్ 2019 సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మైక్రోసాఫ్ట్ చెబుతోంది. 

* ఆఫీస్ 2019లో సిస్ట‌మ్స్ అడ్మినిస్ట్రేట‌ర్స్‌కి ఈజీ డిప్లాయిమెంట్ ఉంది. కాబట్టి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ విష‌యంలోగానీ, సెక్యూరిటీ ప్యాచెస్ తీసుకోవ‌డం గానీ చాలా ఈజీగా చేసుకోవ‌చ్చు. 

* రోమింగ్ పెన్సిల్ కేస్‌, ప్రెజ‌ర్ సెన్సిటివిటీ, టిల్ట్ ఎఫెక్ట్స్,

* ఎక్సెల్ ఫార్మాట్‌లో డేటా విశ్లేష‌ణ‌లో మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. 

* ఇంప్రూవ్డ్ బిజినెస్ ఇంటిలిజెన్స్ ఇంటిగ్రేష‌న్ 

* ప‌వ‌ర్‌పాయింట్‌లో మార్ఫింగ్ అండ్ జూమింగ్ ఫీచ‌ర్ల‌తో కూడిన న్యూ ప్ర‌జంటేష‌న్ విజార్డ్‌
దాదాపుగా ఈ ఫీచ‌ర్ల‌న్నీ ఆఫీస్ 365 ప్రోప్ల‌స్‌లో కూడా ఉన్నాయి. కానీ అప్‌డేటెడ్ వెర్ష‌న్ కావ‌డంతో పెర్‌ఫార్మెన్స్‌, సెక్యూరిటీ ప‌రంగా మ‌రింత బాగుండే అవ‌కాశం ఉంది.

జన రంజకమైన వార్తలు