• తాజా వార్తలు

ప్రివ్యూ- ఏమిటీ వాట్సాప్ ఫ్రీ క్రెడిట్ స్కోర్‌?

మీరు లోన్ గానీ, క్రెడిట్‌కార్డ్‌గానీ తీసుకుంటే తిరిగి ఎంత వ‌ర‌కు క‌ట్ట‌గ‌ల‌రో బ్యాంకులు క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్‌ చూసే నిర్ధారిస్తాయి. ఒక‌రకంగా చెప్పాలంటే సిబిల్ స్కోర్ మీ  సంపాద‌న‌కు, అప్పు తీసుకుంటే తిరిగి తీర్చ‌గ‌ల‌రు అని చెప్పే స‌ర్టిఫికెట్ ఇది. సిబిల్ స్కోర్ బాగుంటే బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు మీ వెంట‌ప‌డి లోన్లు ఇస్తాయి. అయితే ఇందుకోసం మీరు ఈఎంఐలు టైం ప్ర‌కారం చెల్లించాలి. పేమెంట్ డ్యూ డేట్ దాటాక బిల్లులు క‌ట్టినా, మీరు ఇచ్చిన చెక్ బౌన్స్ అయినా అది మీ సిబిల్ స్కోర్‌ను త‌గ్గిస్తుంది. అందుకే మీ సిబిల్ స్కోర్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చూసుకుంటూ ఉంటే రేపు మీరు అప్పు కోసం అడిగితే వెంట‌నే అందుతుంది. 
 

వాట్సాప్ చేస్తే సిబిల్ స్కోర్‌
ఒక‌ప్పుడు ఈ సిబిల్ స్కోర్ తెలుసుకోవాలంటే ఐదారు వంద‌ల రూపాయ‌లు ఖ‌ర్చ‌య్యేది. ఇప్పుడు చాలా సైట్లు ఫ్రీగా కూడా మీ సిబిల్ స్కోర్ చెబుతున్నాయి. విష్‌ఫిన్ అనే ఫిన్‌టెక్ సంస్థ మ‌రో అడుగు ముందుకేసి వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు మీ క్రెడిట్ స్కోర్ చెప్పే సౌక‌ర్యం తెచ్చింది. ఇది ఫ్రీస‌ర్వీస్‌.  

ఎలా వాడుకోవాలి?

* మీ వాట్సాప్ నెంబ‌ర్ నుంచి 82 87 151 151 నెంబ‌ర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

* వెంట‌నే Wishfin CIBIL Score గ్రూప్‌లో మిమ్మ‌ల్ని యాడ్ చేస్తుంది. 

*మీ పేరు, డేట్ ఆఫ్ బ‌ర్త్‌, జెండ‌ర్‌, పాన్ కార్డ్ నెంబ‌ర్‌, అడ్ర‌స్‌, స్టేట్‌ అడుగుతుంది.

* అవి ఎంట‌ర్ చేయ‌గానే మీ సిబిల్ స్కోర్ జ‌న‌రేట్ అవుతుంది. అక్క‌డో లింక్ వ‌స్తుంది. దాన్ని క్లిక్‌చేస్తే మీ సిబిల్ స్కోర్ ఎంతో చూపిస్తుంది.

* సెక్యూరిటీ ప‌ర్ప‌స్ కోసం వెంట‌నే మీ నెంబ‌ర్‌ను విష్‌ఫిన్ త‌న గ్రూప్ నుంచి రిమూవ్ చేసేస్తుంది.

జన రంజకమైన వార్తలు