సెల్‌ఫోన్ కెమెరాలో ఎన్నో మార్పులు చూశాం. నామమాత్రంగా ఫోటో వచ్చే వీజీఏ కెమరాలతో మొదలైన సెల్‌ఫోన్ ఫోటోగ్రఫీ ఇప్పుడు డిజిటల్ కెమెరాలను తలదన్నే స్థాయికి చేరింది. 4కే, 8కే వీడియో రికార్డింగ్ కూడా చేయగలిగే కెమెరాలతో స్మార్ట్ ఫోన్ కంపెనీలు మార్కెట్లో దుమ్ము రేపుతున్నాయి. ఒకప్పుడు ఒకటే కెమెరా.. తర్వాత సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా, వెనుకవైపు రెండు, మూడు, నాలుగు ఇలా కెమెరాల సంఖ్యతో పాటు వాటి పెర్‌ఫార్మెన్స్ కూడా డెవలప్ అవుతోంది. అయితే జెడ్‌టీఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మరో అడుగు ముందుకేసింది. కంటికి కనిపించని కెమెరాతో స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తోంది.
డిస్‌ప్లే కిందే కెమెరా
స్మార్ట్‌ఫోన్లలో కెమెరాలు ఎన్ని ఉన్నాయో మనకు పైకి కనిపిస్తాయి. కానీ జెడ్‌టీఈ త్వరలో విడుదల చేయనున్న ఆక్సాన్ 20 5జీ ఫోన్లో కెమెరా కంటికి కనపడదు. ఎందుకంటే ఫోన్ డిస్‌ప్లే కింద ఉంటుంది. అంటే ఫోన్ ఫ్రంట్ పార్ట్‌లో ఎలాంటి కెమెరా కానీ, పంచ్ హోల్, వాటర్ డ్రాప్ నాచ్ లాంటి మోడల్స్ కానీ ఏమీ ఉండవు. అంటే ఈ ఫోన్ బీజిల్‌లెస్ అన్నమాట. ఫోన్ పై భాగం మనకు కనిపించేదంతా డిస్‌ప్లేనే ఉంటుంది.
ఈ ఫీచర్లతో
* ఆక్సాన్ 20 5జీ ఫోన్.. మిడ్ ప్రైస్ రేంజ్ స్మార్ట్‌ఫోన్.
* 6.9 ఇంచెస్ ఓలెడ్ డిస్‌ప్లే
* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765 జీ ప్రాసెసర్
* 64 ఎంపీ రియర్ కెమెరా
* ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
సెప్టెంబర్ 1న మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.