• తాజా వార్తలు

ప్రివ్యూ - ఏమిటీ డ్యూయ‌ల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్‌?  షియోమి ఎందుకు తెచ్చింది?

లైవ్ లొకేష‌న్ పెట్టినా, ఎవ‌రికైనా లొకేష‌న్ షేర్ చేసినా? అది రెండు, మూడు ఇళ్ల అవ‌త‌లో, రెండు, మూడు బిల్డింగ్‌ల అవ‌త‌లో చూపిస్తుంది.  క‌చ్చిత‌మైన లొకేష‌న్ కాకుండా 5 నుంచి 10 మీట‌ర్ల  దూరంలో చూపిస్తుంది. దీనికి కార‌ణం ఇది సింగిల్ ఫ్రీక్వెన్సీ బాండ్‌తో కూడిన జీపీఎస్ కావ‌డ‌మే.  కొత్త టెక్నాల‌జీని త‌న మొబైల్ ఫోన్ల‌కు అడాప్ట్ చేయ‌డంలో ముందుండే షియోమి దీనికి ప‌రిష్కారంగా డ్యూయ‌ల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్‌ను రంగంలోకి తెచ్చింది.  రీసెంట్‌గా చైనాలోని  షెంజెన్‌లో లాంచ్ చేసిన ఎంఐ8, ఎంఐ 8 ఎక్స్‌ప్లోర‌ర్ ఎడిష‌న్ స్మార్ట్‌ఫోన్ల‌లో ఈ డ్యూయ‌ల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్‌ను ప్ర‌ద‌ర్శంచింది. 

ఎందుకు ఈ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్‌?
ప్ర‌స్తుతం మ‌న స్మార్ట్‌ఫోన్ల‌లో ఉన్న‌ది సింగిల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్‌. ఇందులో ఎల్ 1 బాండ్ ఉంటుంది.  మీరున్న పొజిష‌న్‌కు సంబంధించి శాటిలైట్ వ్యూను తీసుకుని స్మార్ట్‌ఫోన్‌లో చూపిస్తుంది. దీన్నే మీరు లొకేష‌న్‌గా షేర్ చేస్తారు.  ఈ ప‌ద్ధ‌తిలో క‌నీసం 5 మీట‌ర్లు  అంత‌కంటే ఎక్కువ వేరియేష‌న్‌తో మీ లొకేష‌న్ చూపిస్తుంది. అయితే డ్యూయ‌ల్ ఫ్రీక్వెన్సీలో ఎల్‌1, ఎల్ 5 బాండ్లు ఉంటాయి. ఇవి రెండూ రెండు ఫ్రీక్వెన్సీల‌తో లొకేష‌న్ చూపిస్తాయి. కాబ‌ట్టి అది యాక్యురేట్‌గా ఉంటుంది.  30 సెంటీమీట‌ర్ల లోపే ఎగ్జాక్ట్ లొకేష‌న్  ఉంటుంది.ఎత్త‌యిన బిల్డింగ్‌లున్న పెద్ద సిటీల్లో సింగిల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్‌తో క‌చ్చిత‌మైన లొకేష‌న్ గుర్తించలేం. డ్యూయ‌ల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్‌తో ఈ స‌మ‌స్య తీరిపోతుంది. అందుకే షియోమి ఈ ఫీచ‌ర్‌ను త‌న లేటెస్ట్ ఫోన్ల‌కు తీసుకొస్తోంది. లాంచింగ్ ఈవెంట్‌లో షియోమి.. పూర్తిగా అద్దాలు మూసేసి లాక్ చేసిన కారును ఒక సొరంగంలాంటి మార్గంలో న‌డిపించి దాన్ని ఈ డ్యూయ‌ల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్ ద్వారా లొకేట్ చేసి చూపించింది. అంటే ఎలాంటి ప‌రిస్థితుల్లో అయినా యాక్యురేట్‌గా లొకేష‌న్‌ను చూపిస్తుంద‌ని చెప్పింద‌న్న‌మాట‌.

ఫోన్ కంపెనీల‌న్నీ రెడీ అయిపోతాయా?
స‌హ‌జంగానే షియోమి లాగే తాము కూడా డ్యూయ‌ల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్ ఫీచ‌ర్‌ను త‌మ కొత్త ఫోన్ల‌లో ప్ర‌వేశ‌పెట్టాల‌నిం కంపెనీలు భావించి రంగంలోకి దిగుతాయి. అయితే అదంత ఈజీకాదు.  ప్ర‌స్తుతం ఈ డ్యూయ‌ల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్ కాన్సెప్ట్‌ను ఆయిల్‌, గ్యాస్ నిక్షేపాలు వెలికితీసే ప్ర‌క్రియ‌లో మాత్ర‌మే ఉప‌యోగిస్తున్నారు.  ఎందుకంటే ఎల్‌5 బాండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చే శాటిలైట్లు ఆర్బిట్‌లో 30 కంటే ఎక్కువ లేవు.  కాబ‌ట్టి  క‌న్స్యూమ‌ర్ మార్కెట్‌లో వీటిని వినియోగించ‌డానికి అవ‌కాశాలు త‌క్కువ‌. అయితే షియోమి ఈ డ్యూయ‌ల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్ ఫీచ‌ర్‌ను సంపాదించుకోగ‌లిగింది. దీనికి అవ‌స‌ర‌మైన చిప్‌ను ఎక్క‌డి నుంచి తెచ్చింద‌నేది కూడా టెలికం వ‌ర్గాల్లో ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది.  .
 

జన రంజకమైన వార్తలు