ఫుట్‌బాల్ ఫీవర్ నిన్నటిదాకా ప్రపంచాన్ని ఊపేసింది. అందులో తలతో కొట్టే (హెడర్) గోల్ చూసి ఔరా అని ఆశ్చర్యపోతుంటాం కదా.. అదిగో అలాంటి ఫీచర్‌తో వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్ నెక్స్‌ను రిలీజ్ చేసింది. ఎలివేటెడ్ సెల్ఫీ కెమెరా పేరిట తీసుకొచ్చిన ఈ కొత్త సోకేంటో చూద్దాం రండి..
నెత్తిమీద కెమెరా
ఫుట్‌బాల్ ప్లేయర్లు తలతో గోల్ కొట్టినట్లే సెల్ఫీ కెమెరాను ఫోన్ నెత్తిన పెట్టారు ఈ మోడల్‌లో. సెల్ఫీ బటన్ ఆన్ చేయగానే ఈ కెమెరా ఫోన్ లోపలి నుంచి యాంటెన్నాలా పైకి వస్తుంది. సెల్ఫీ తీసుకుని కెమెరా ఆఫ్ చేయగానే ఆ కెమెరా ఫోన్‌లోపలికి వెళ్లిపోతుంది. ఇప్పటికే టాప్ నాచ్ ఫోన్లతో మార్కెట్‌లో పెద్ద కంపెనీలు హంగామా చేస్తుండగా దాన్ని వివో ఈ ఎలివేటెడ్ సెల్ఫీకెమెరాతో మరింత ముందుకు తీసుకెళ్లింది. ఇలాంటి కెమెరా సెటప్ స్మార్ట్‌ఫోన్లలో ఇదే తొలిసారి.
ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు పోటీ
టాప్ నాచ్ ఫీచర్‌తో వచ్చిన శాంసంగ్, యాపిల్ ఫోన్లకు పోటీగా వివో ఈ నెక్స్ ఫోన్‌ను రంగంలోకి దించింది. ఇతర ఫీచర్లు కూడా భారీగానే ఉన్నాయి.
* 6.59 ఇంచెస్ సూపర్ అమౌల్డ్ డిస్‌ప్లే
* 19.3:9 యాస్పెక్ట్ రేషియోతో తక్కువ బీజిల్స్‌తో భారీ స్క్రీన్ . ఇప్పటివరకు బాడీ, స్క్రీన్ రేషియో 90% ఉండడమే ఎక్కువ. వివో నెక్స్‌లో అది 91.24% అంటే ఈ రకంగానూ వివో నెక్స్ రికార్డ్ సృష్టించినట్లే.
* స్క్రీన్ సౌండ్ కాస్టింగ్ టెక్నాలజీ (అంటే ఫోన్ డిస్‌ప్లే మొత్తం స్పీకర్‌లా మారిపోతుంది)
* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్
* 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ
* వెనకవైపు 12, 8 మెగాపిక్సెల్ కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
ధర 45 వేల వరకు ఉండొచ్చు.