చైనా మొబైల్ కంపెనీ షియోమి.. ఇప్పుడు ఇండియాలో టీవీ స్టిక్స్ బిజినెస్‌పై కన్నేసింది. ఇప్పటికే ఈ రంగంలో గూగుల్ క్రోమ్ కాస్ట్, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ హవా చెలాయిస్తున్నాయి. వాటికి పోటీగా ఎంఐ బాక్స్ 4కేను ఈ రోజు లాంచ్ చేసింది.
ఏమిటీ ఎంఐ బాక్స్
నాన్ స్మార్ట్ టీవీని కూడా స్మార్ట్ టీవీగా వాడుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. గత నాలుగేళ్లలో 3 కోట్ల 40 లక్షల మంది నాన్ స్మార్ట్ టీవీలు కొన్నారని, వారిని ఆకట్టుకోవడానికే ఎంఐ బాక్స్4కేను తీసుకొచ్చామని షియోమి చెబుతోంది.
ఇవీ ఫీచర్లు
ఎంఐ బాక్స్4కే .. హెచ్‌డీ, ఫుల్ హెచ్‌డీ, అల్ట్రా హెచ్‌డీ కంటెంట్‌ను సపోర్ట్ చేస్తుంది.
గూగుల్ క్రోమ్‌కాస్ట్, గూగుల్ అసిస్టెంట్‌ను ఇన్‌బిల్ట్‌గా ఇచ్చింది. కాబట్టి వాయిస్ కమాండ్లతో కూడా దీన్ని రన్ చేయొచ్చు.
5వేల గేమ్స్, యాప్స్‌ను ఎంఐ బాక్స్ 4కేలో ఇన్‌స్టాల్ చేసింది.
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ చూడొచ్చు.
యూట్యూబ్, డిస్నీప్లస్ హాట్ స్టార్ కంటెంట్‌ను కూడా యూజర్లు వీక్షించవచ్చు.
పెన్‌డ్రైవ్ ఆప్షన్ కూడా
ఆఫ్‌లైన్ కంటెంట్‌ను చూడడానికి వీలుగా పెన్‌డ్రైవ్ పెట్టుకోవడానికి యూఎస్‌బీ పోర్ట్‌ను కూడా ఇచ్చింది.
బ్లూటూత్ 4.2 ఉంది. దీంతో వైర్‌లైస్ ఇయర్ ఫోన్స్‌ను కూడా వాడుకోవచ్చు.
డేటా సేవర్
డేటాను ఆదా చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశామని ఇందుకోసం గూగుల్ నుంచి వచ్చిన డేటా సేవర్ టెక్నాలజీని ఇందులోఇచ్చామని షియోమి చెబుతోంది. 3 రెట్లు తక్కువ డేటాతోనే మీరు వీడియో కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. డాల్బీ ఆడియో, డీటీఎస్ ఉన్నాయి.
ధర 3,499
ఎంఐ బాక్స్ 4కే ధర 3,499 రూపాయలు. అమెజాన్ ఫైర్ స్టిక్ 4కే ధర 5,999 కంటే ఇది దాదాపు 40% తక్కువ. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఎంఐ అఫీషియల్ వెబ్‌సైట్‌లో లభిస్తుంది.