టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI)గత రెండు, మూడు నెలలుగా తరచుగా వార్తల్లో వినిపిస్తున్న పదం. టీవీ ఛానెల్స్, ధరలు, ప్యాకేజీల విషయంలో ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఈ రూల్స్ పై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. వినియోగదారులు తామకు కావాల్సిన ఛానెల్స్ సెలక్ట్ చేసుకునే వెసులుబాటు కల్పించామని ట్రాయ్ చెబుతుంటే....ఛానెల్స్ వేర్వేరుగా సెలక్ట్ చేసుకుంటే బిల్లు వాచిపోతుందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ మధ్యే ట్రాయ్ ఒక ఆదేశాన్ని జారీచేసింది. అదేంటంటే...ఛానెల్ ప్రొవైడర్లు వారు ఛానెళ్లు ప్రసారం చేసేందుకు ఛానెళ్ల ధరను నిర్ణయిస్తారు. కేబుల్ లేదా dthవినియోగదారులు తాము సెలక్ట్ చేసుకున్న ఛానెళ్ల కోసం మాత్రమే ధరను చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఏ ఛానెల్ కు ప్రత్యేకంగా ధర చెల్లించాల్సి అవసరం లేదు. దీంతో యూజర్లకు ఇన్ స్టలేషన్ ఛార్జీలతోపాటు నెలవారీ ఛార్జీల భారం తగ్గుంది. ట్రాయ్ ఛానెల్ సెలెక్టర్ యాప్ ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం.
ట్రాయ్ ఛానెల్ సెలెక్టర్ అప్లికేషన్ అంటే ఏమిటి?
యూజర్లు వారికి కావాల్సిన ఛానెల్ ప్యాకేజీ గురించి తెలుసుకునేందుకు ట్రాయ్ ఛానెల్ సెలెక్టర్ అప్లికేషన్ను ప్రారంభించింది. ఈ అప్లికేషన్ ట్రాయ్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. సబ్ స్క్రైబర్లకు అన్ని ఛానెళ్లకు కలిపి ఎంత ధర ఉంటుందో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు ఈ యాప్ ద్వారా ప్రతినెలా ఎంత ఛార్జీ చెల్లించాలనేది ఈ యాప్ లో క్లుప్తంగా పొందుపరిచి ఉంటాయి. ఈ యాప్ ద్వారా యూజర్లు సెలక్ట్ చేసుకున్న అన్ని ఛానళ్లను వీక్షించే అవకాశం ఉంటుంది. దీంతో మీకు ఏ ఆఫర్ అయినా సరే అందుబాటులో ఉంటే...ఈ యాప్ మీ ఛానెల్ యొక్క ధరలకు ఈ ఆఫర్ను యాడ్ చేస్తుంది. అంతేకాదు ఛానెళ్ల సంఖ్యను తగ్గించకుండా..కేవలం ఛానెల్ యొక్క ఛార్జీలను తగ్గించుకోవచ్చు.
ట్రాయ్ సెలక్టర్ అప్లికేషన్ను ఎలా ఉపయోగించాలి?
ట్రాయ్ సెలక్టర్ యాప్ ను ఉపయోగించడం చాలా సులభం. ముందుగా మీరు ఛానెల్ సెలెక్టర్ వెబ్ సైట్లోకి వెళ్లి...ప్రారంభించు అనే బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు పేరు, మొబైల్ నెంబర్, సర్వీస్ ప్రొవైడర్ వంటి వివరాలతోపాటు...ఇంతకు ముందు చెల్లించిన బిల్లు మొత్తానికి సంబంధించిన డిటేయిల్స్ అడుగుతుంది. మీరు ఈ వివరాలన్నింటిని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేశాక...మీరు ఎక్కడ నివాసముంటున్నారో అడుగుతుంది. మీరుండే ప్రాంతంలో ఉండే ఛానెల్ల అప్లికేషన్ గురించి తెలుపుతుంది. మీరుండే ప్రాంతంతోపాటు...భాషలు, సహాభాషలకు సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. ఇవ్వన్నీ నమోదు చేసిన తర్వాత...తదుపరి పేజీలోకి వెళ్లాలి. ఆ పేజీలో న్యూస్, మ్యూజిక్, డివోషన్, స్పోర్ట్స్ ఇలా మీకు కావాల్సిన కేటగిరిలు ఉంటాయి. అందులో నుంచి మనకు కావాల్సిన వాటిని సెలక్ట్ చేసుకోవచ్చు. చివరగా HD,SD ఈ రెండింటిలో ఒకటి....లేదా ఈ రెండింటిని సెలక్ట్ చేసుకోవచ్చు.
ఈ ఆప్షన్స్ అన్ని కూడా సెలక్ట్ చేసిన తర్వాత....ఛానెల్ సెలెక్టర్ యాప్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు కావాల్సిన ఫ్రీ ఎయిర్ ఛానెల్స్ ట్యాబ్లో ఆన్ స్క్రీన్ లో కనిపిస్తాయి. స్క్రీన్ పై భాగంలో ఛానెల్ సెలక్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. అంతేకాదు మీరు సెలక్ట్ చేసుకున్న ఛానెల్స్ ధరను కూడా డిస్ ప్లే చేస్తుంది. FTAజాబితాలో మొత్తం 550 ఛానెళ్లు ఉంటాయి. అందులో మీకు కావాల్సిన ఛానెల్స్ ను సెలక్ట్ చేసుకున్న తర్వాత పే-కార్-కార్డు ద్వారా పే ఛానెల్స్ ట్యాబ్ కు నావిగేట్ చేస్తుంది.
ఛానెల్ సెలెక్టర్ యాప్ తో నెలవారీ బిల్లును తగ్గించవచ్చు.
ట్రాయ్ ఛానెల్ సెలెక్టర్ అప్లికేషన్ కు సంబందించిన ఆప్టిమైజ్ బటన్ నొక్కండి. ఈ ఫీచర్ మీ కార్ట్లో ఉన్న అదనపు ఛానెళ్లను తొలగిస్తుంది. మీకు కావాల్సిన ఛానెళ్లను మాత్రమే సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందులో కొన్ని గ్రూప్ ఛానెల్స్ బొకే ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఇలా తక్కువ ధరతో ఎక్కువ ఛానెల్స్ ను సెలక్ట్ చేసుకోవచ్చు.
చివరగా మీ కొత్త ఛానెల్స్ ప్యాక్ ఆప్షన్స్ ఎంచుకోవడం.
మీకు కావాల్సి ఛానెళ్లను సెలక్ట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత...బిల్లును మీ ఛానెల్ ఆప్షన్ను ప్రింట్ తీసుకోండి లేదా ల్యాప్ టాప్ కానీ కంప్యూటర్లో కానీ సేవ్ చేసుకోండి. మీకు కావాల్సిన ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవడానికి DTH లేదా కేబుల్ టీవీ ప్రొవైడర్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి. ఇప్పుడు ట్రాయ్ దరఖాస్తు జాబితా నుంచి మీ డిటిహేచ్ వెబ్ సైట్లో బొకేట్స్ , ఎఫ్ టీఏ ఛానల్స్ ఆప్షన్లను కాపీ చేయండి. కొన్ని గంటల్లోనే ఛానెల్స్ అప్ డేట్ అవుతాయి.