కాల్ డ్రాప్స్‌తో విసిగిపోయారా? వెకేషన్‌కో, ఆఫీస్ పనిమీదో వెళ్లినచోట మొబైల్ నెట్‌వర్క్ లేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ కష్టాలు తీర్చేందుకు ఓ కొత్త పరిష్కారం రాబోతోంది. అదే కాల్ ఓవర్ వైఫై. మొబైల్ నెట్‌వర్క్‌తో ఎలా కాల్ చేసుకుంటున్నామో అలాగే వైఫైతో కూడా కాల్స్ చేసుకునే సౌకర్యం త్వరలో అందుబాటులోకి రాబోతుంది. టెలికం అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇంతకీ వైఫైతో కాల్స్ ఎలా చేసుకోగలం అనుకుంటున్నారా? దానికి ఏం చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ చదివేయండి.
ఇంటర్నెట్ టెలిఫోనీకి ఓకే
సరైన సిగ్నల్స్ లేక కాల్‌డ్రాప్స్‌తో ఇబ్బంది పడుతున్నవారికి, మొబైల్ నెట్‌వర్క్ ఇప్పటికీ సరిగాలేని ప్రాంతాల వారికి మెరుగైన సేవలందించడానికి ట్రాయ్.. ఇంటర్నెట్ టెలిఫోనీని సిఫార్సు చేసింది. బ్రాడ్‌బ్యాండ్ ఉంటే చాలు అక్కడ నుంచి మొబైల్ లేదా ల్యాండ్ లైన్ నెంబర్లకు కాల్ చేసుకునే అవకాశం కల్పించాలన్నది ఆ సిఫార్సు. దీన్నిటెలికం శాఖలో ఇంటర్ మినిస్టీరియల్ టెలికం కమిషన్ మంగళవారం ఓకే చేసింది. ఇప్పటికే దేశంలో టెలికం లైసెన్స్‌లున్న బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, ఐడియా, జియో లాంటి ఆపర్లేటర్లందరికీ ఇంటర్నెట్ టెలిఫోనీకి పర్మిషన్ ఇవ్వబోతున్నారు.
యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు
* కస్టమర్ తన మొబైల్‌ఫోన్‌లో మీకు నచ్చిన కంపెనీ (జియో, ఎయిర్‌టెల్ ఏదైనా) ఇంటర్నెట్ టెలిఫోన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* యాప్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకున్నాక మీకు ఓ 10 అంకెల నంబర్‌ను కేటాయిస్తారు. ఇది మొబైల్ నెంబర్‌లాగే ఉంటుంది.
* దీనిలో మీకు సిమ్ కార్డ్ అంటూ ఏమీ ఉండదు. ఆ నెంబర్‌తో యాప్ ద్వారానే మీరు కాల్ చేసుకోవచ్చు.
* మొబైల్, ల్యాండ్ లైన్ నెంబర్లు వేటికయినా కాల్ చేసుకోవచ్చు.
* మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ అయి ఉండి ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టెలిఫోన్ యాప్‌తోనే కాల్స్‌చేసుకుంటానంటే మీకు కొత్త నెంబర్ కూడా అవసరం లేకుండా అదే నెంబర్‌తో వైఫై మీద కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇతర నెట్‌వర్క్‌లకు ఇదే సూత్రం.
సక్సెస్ అవుతుందా?
ఈ పద్ధతిలో సిమ్ కార్డు ఉండదు. వైఫై మీద కాల్స్ చేసుకుంటాం కాబట్టి రీఛార్జి చేయాల్సిన పని ఉండదు. ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లలో బోలెడు డేటా ఇస్తున్నారు. కాల్స్ చేసుకుంటే డేటా ఖర్చయినా ఎవరూ పట్టించుకోరు. రీఛార్జి ఉండదు డబ్బులు రావు కాబట్టి కంపెనీలు ఎంతగా దృష్టి పెడతాయన్నది ముందు ముందు గానీ తేలదు. అదీకాక మొబైల్ నెట్‌వర్క్‌కే దిక్కులేని మారుమూల ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ఎంతవరకు ఉంటుందన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. అయితే పట్టణాలు, నగరాల్లో కూడా నెట్‌వర్క్ ట్రాఫిక్ ఎక్కువై కాల్ డ్రాప్స్,కాల్ కనెక్ట్ కాకపోవడం వంటి ఇబ్బందులు పడుతున్నవాళ్లకు ఇది అద్భుతమైన ఆప్షన్.