• తాజా వార్తలు

'శాంసంగ్ జడ్4'.. రెడ్‌మీ 4.. రెండూ రేపే లాంఛింగ్



స్మార్టు ఫోన్ మార్కెట్ లో రేపు రెండు ముఖ్యమైన ఫోన్లు లాంఛ్ కానున్నాయి. ఒకటి దిగ్గజ కంపెనీ శాంసంగ్ నుంచి కాగా రెండోది సూపర్ సేల్స్ రికార్డు ఉన్న షియోమీ నుంచి. శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'జడ్4' ను రేపు అంటే మే 16వ తేదీన కాలిఫోర్నియాలో జరగనున్న ఓ ఈవెంట్‌లో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను అదే రోజు ప్రకటించనుంది.

మరోవైపు షియోమీ కూడా తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 4ను రేపే విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా ప్రకటించలేదు. రెడ్‌మీ 4ను స్టాండర్డ్, హై ఎండ్ వేరియెంట్లలో షియోమీ విడుదల చేయనుంది.

శాంసంగ్ జడ్4 స్పెసిఫికేషన్లు

4.5 ఇంచ్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
800 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్
డ్యుయల్ సిమ్, టైజన్ ఓఎస్ 3.0
5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
2050 ఎంఏహెచ్ బ్యాటరీ

షియోమీ రెడ్‌మీ 4 స్టాండర్డ్ వేరియెంట్ స్పెసిఫికేషన్లు



5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్
2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీఈ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

రెడ్‌మీ 4 హై ఎండ్ వేరియెంట్ ఫీచర్లు...



5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

జన రంజకమైన వార్తలు