ప్రధాన కంపెనీల స్మార్టు ఫోన్లు మార్కెట్లను ముంచెత్తనున్నాయి. మోటోరాలా కూడా ఈ క్రమంలో కొత్త ఫోన్లతో సేల్స్ పెంచుకునేందుకు రెడీ అవుతోంది. త్వరలో మరో రెండు కొత్త మోడళ్లను లాంఛ్ చేయడానికి రెడీ అవుతోంది. ఇందులో భాగంగా తొలుత 'మోటో ఈ4 ప్లస్ ను విడుదల చేయనుంది. దీని ధర రూ.10,460 గా నిర్ణయించారు. దీని తరువాత 'మోటో జడ్2 ప్లస్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. జడ్ 2 ప్లే ధర ఇంకా ప్రకటించలేదు. అయితే... 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజి ఉండడంతో దీని ధర రూ.15 వేల కంటే ఎక్కువే ఉండొచ్చని భావిస్తున్నారు.
మోటో ఈ4 ప్లస్ స్పెసిఫికేషన్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్సీ
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
మోటో జడ్2 ప్లే స్పెసిఫికేషన్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్సీ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్