నేడు ఉన్న దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్ తయారీలలో ARM కంపెనీ కీలక పాత్రను పోషిస్తుంది. సిలికాన్ వ్యాలీ కి చెందిన ఈ కంపెనీ దిగ్గజ కంపెనీలైన ఆపిల్, సామ్సంగ్, క్వాల్ కాం ల యొక్క ఉత్పత్తులలోని లోపలి భాగాలైన చిప్ సెట్ లు అన్నీ ఇది అందిస్తుంది.
తాజాగా ఇది రెండు నూతన ఉత్పత్తులను తైవాన్ లో జరుగుతున్న కంప్యుటేక్స్ లో ప్రదర్శనలో ఉంచింది. అవి ఫ్లాగ్ షిప్ గ్రేడ్ కార్టెక్స్ 75. ఇది A73 యొక్క తర్వాతి వెర్షన్ కాగా మరొకటి మిడ్ టయర్ కార్టెక్స్ A55. ఇది A53 యొక్క తర్వాతి వెర్షన్. ప్రదర్శన వారిగా చూసుకుంటే తర్వాతి తరం స్మార్ట్ ఫోన్ లలో ఇది ఒక నూతన ఉత్తేజాన్ని నింపే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ ప్రాసెసర్ లో ఉండే ప్రాముఖ్యమైన అంశం కంపెనీ యొక్క లేటెస్ట్ డై మాక్ IQ CPU . ఇది బిగ్.లిటిల్ ఆర్కిటెక్చర్ ను అప్ గ్రేడేడ్ వెర్షన్. దీనివలన తయారీదారులు తమ అవసరాలకు తగ్గట్లు చిప్ లను తయారు చేసుకునే వెసులు బాటు ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా చిప్ మేకర్ 7 చిన్న A55 కోర్ లు మరియు ఒక పెద్ద A75 కోర్ లతో కలిపి లాంగ్ బ్యాటరీ లైఫ్, కాస్ట్ ఎఫిషియన్సీ మరియు హై సీలింగ్ పెర్ఫార్మన్స్ ఉండే వాటిని తయారు చేసుకోవచ్చు.
ఇలాంటి వివిధ రకాల కాంబినేషన్ లు బిగ్. లిటిల్ తో కూడా సాధ్యం అయ్యేవి. అయితే ఇక్కడ తయారీ దారుడు తప్పనిసరిగా రెండు కోర్ లను మ్యాచ్ చేయవలసి ఉండేది. అయితే ఈ డైమాక్ IQ ద్వారా ఎయిట్ కోర్ చిప్ లో ఏ కాంబినేషన్ ను అయినా సెట్ చేసుకునే వీలు ఉంటుంది. అంటే ఇకపై వచ్చే స్మార్ట్ ఫోన్ లు మరిన్ని రకాల స్పెసిఫికేషన్ లను కలిగి ఉండబోతున్నాయి అన్నమాట.
ఇందులో మరొక ముఖ్యమైన అంశం ఈ సరికొత్త ప్రాసెసర్ ఎక్కువ పవర్ వినియోగాన్ని తట్టుకోగలదు. అంటే ఇది మామూలు ప్రాసెసర్ లతో పోలిస్తే పెద్ద స్క్రీన్ డివైస్ ల్పి 30 శాతం అదనపు పర్ఫార్మన్స్ ను ఇస్తుంది. ARM తన రాబోయే సెల్యూలర్ pc అనే ప్రాజెక్ట్ లో లాప్ టాప్ లను మొబైల్ ప్రాసెసర్ లతో ఎనేబుల్ చేయడం పై దృష్టి పెట్టింది. రెండు నెలల క్రితం దీనికి సంబందించిన డెమో కూడా చూపబడింది. ఈ రకంగా చూసుకుంటే రానున్న రోజులలో ఈ కంపెనీ నుండి మరిన్ని ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.