ఐ ఫోన్ చాలామందికి కల. కానీ దాని ధర మాత్రం ఆకాశంలోనే ఉంటుంది. ఇండియాలో తయారుచేసినా, మన యూజర్ల కోసం ధర తగ్గించినా దాని ధర మాత్రం హైఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్‌కు డబుల్ ఉంటుంది. అయితే ఐఫోన్ ధర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే ఐఫోన్లలో బ్యాటరీ టెక్నాలజీని మార్చాలని యాపిల్ ఆలోచిస్తుండటమే అందుకు కారణం.
ఏమిటీ కొత్త టెక్నాలజీ?
వచ్చే సంవత్సరం మార్కెట్లోకి వచ్చే ఐఫోన్ 13లో సాఫ్ట్ బోర్డ్ టెక్నాలజీని వాడబోతున్నారు. ఇది తక్కువ స్పేస్‌లోనే ఎక్కువ పవర్‌ను పట్టి ఉంచగలుగుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీతో చేసిన బ్యాటరీలు చిన్న సైజులో ఉన్నా పెర్‌ఫార్మెన్స్ బాగుంటుంది. ఈ బ్యాటరీలు వాడటం వల్ల ఫోన్ సైజు తగ్గుతుంది. కాంపాక్ట్ డిజైన్‌తో బాగా పాపులరయిన ఐఫోన్‌లో కొత్త మోడల్స్‌ను కూడా ఇలాగే తీసుకురావాలని యాపిల్ అనుకుంటోంది. అంతేకాదు ఈ బ్యాటరీల వల్ల ఫోన్ ధర కూడా తగ్గే అవకాశాలున్నాయని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.
ఇదే మొదటిసారి
ఐఫోనే కాదు ఏ యాపిల్ డివైస్‌లో అయినా సాఫ్ట్‌బోర్డ్ టెక్నాలజీని వాడటం ఇదే ప్రథమం. ఐఫోన్ 13లో కనుక ఇది సక్సెస్ అయితే ఐపాడ్, యాపిల్ మ్యాక్‌బుక్ వంటివాటికి కూడా ఇదే బ్యాటరీ టెక్నాలజీని వాడాలని యాపిల్ భావిస్తుందని సమాచారం.