బాహుబలి.. బాహుబలి! ఎక్కడ చూసినా బాహుబలి ఫీవరే! ఈ నెలాఖర్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ మెగా మూవీ చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. ప్రతి ఒక్కరూ టిక్కెట్ల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. థియోటర్లలో లైన్లలో నిలబడి తొక్కిసలాట మధ్య టిక్కెట్లు తీసుకునే రోజులు పోయాయి. ఇప్పుడు అభిమానులు స్మార్ట్ అయిపోయారు. జస్ట్ తమ స్మార్ట్‌ఫోన్‌తో సెకన్లలో టికెట్లు బుక్ చేస్తున్నారు. అలాంటి టెకీల కోసమే పేటీఎం బాహుబలి టిక్కెట్లను తమ సైట్లో అందుబాటులో పెట్టింది. ఈనెల 28న ఈ మూవీ బ్రహ్మాండమైన ఓపెనింగ్ ఉండగా... వారం రోజుల ముందే పేటీఎం ఆన్‌లైన్ ప్రి బుకింగ్‌కు తెర తీసింది. తమ సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకుని ఇలాంటి ఇబ్బంది లేకుండా సినిమా చూడాలని పేటీఎం అభిమానులను కోరింది.
550 నగరాల్లో..
బాహుబలి టిక్కెట్లు కేవలం మల్టీప్లెక్స్‌లకు సంబంధించినవి మాత్రమే కాదు మామూలు థియేటర్‌లకు సంబంధించిన టిక్కెట్లు కూడా పేటీఎం ద్వారా లభ్యం అవుతాయి. ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్ బుకింగ్ అంటే కేవలం మల్టీపెక్స్‌కు సంబంధించిన టిక్కెట్లే అన్న అపోహ చాలా మందికి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేస్తే టిక్కెట్ల రేట్ కూడా ఎక్కువ ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ టెక్నాలజీని వాడుకొని ఆన్‌లైన్ బుకింగ్ చేయడం వల్ల మామూలు ధరకే టిక్కెట్లు దొరుకుతాయని.. తాము క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వడం వల్ల పన్నుల ద్వారా వసూలు చేసే ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చని పేటీఎం చెప్పింది. దేశవ్యాప్తంగా 550 నగరాల్లోని 3500 స్క్రీన్లలో బాహుబలి సినిమాకు తాము ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లను అమ్ముతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
ఎలా బుక్ చేయాలంటే..
బాహుబలి సినిమా టిక్కెట్లను ప్రి బుకింగ్ చేయాలనుకునే వాళ్లు ముందుగా తమ స్మార్టుఫోన్లలో పేటీఎం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో మూవీస్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. మూవీస్‌లోకి వెళ్లిన తర్వాత మీరు ఏ లొకేషన్ (మీ సిటీ) వివరాలు ఇవ్వాలి. ఆ తర్వా ఏ లాంగ్వేజ్‌లో మీరు మూవీ చూడాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత బాహుబలి, ది కన్‌క్లూజన్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. మీకు దగ్గర్లోని థియేటర్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన సీట్లను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత పేమెంట్ చేయాలి. ప్రి బుకింగ్‌పై మీకు 50 శాతం క్యాష్‌బాక్ కూడా లభిస్తుంది.