• తాజా వార్తలు

ప్రివ్యూ-గూగుల్ సెన్సర్ వాల్ట్ - ఇకపై నేరస్థులను చట్టానికి పట్టించేది ఇదే

టెక్నాలజీ ఎంతగానో డెవలప్ అయ్యింది. టెక్నాలజీ ఎంతగా అభివ్రుద్ధి చెందినా...అమాయక ప్రజలను కాపాడలేని పరిస్థితులు ఎన్నో నెలకొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కనీసం వందల మిలియన్ల డివైజులు ఉన్నా ప్రయోజం లేకుండా పోతోంది. కానీ గూగుల్ డేటా బేస్ రూపొందించిన సెన్సర్ వాల్ట్ ద్వారా నేరస్థులు ఎక్కడ ఉన్నా వారి లొకేషన్ను ఈజీగా కనుగొనవచ్చని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. 
ఈ డేటాను గూగుల్ ఎందుకు కలిగి ఉంది?
సెన్సర్ వాల్ట్ డేటా బేస్ అనేది లొకేషన్ హిస్టరీని గూగుల్ సర్వీసుకు యాడ్ చేయబడింది. 2009లో ప్రారంభమైన ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, యాపిల్ డివైజుల్లో అందుబాటులో ఉంది. లొకేషన్ హిస్టరీ ఢిపాల్ట్ గా లేదు. గూగుల్ మ్యాప్స్ లో ట్రాఫిక్ అలర్ట్స్, గూగుల్ ఫోటోలలో ఉన్న లొకేషన్ కు అనుసంధానమైన గ్రూప్ ఇమేజ్ లను ఏర్పాటు చేస్తున్నప్పుడు గూగుల్ వాటిని ఎనేబుల్ చేయడానికి యూజర్ పర్మిషన్ అడుగుతుంది. 
ఒకవేళ మీరు లొకేషన్ హిస్టరీని ఆన్ చేసి ఉంటే...మీ ఆకౌంట్ కు సైన్ ఇన్ చేసిదంతా మీ డేటాను గూగుల్ సేకరిస్తుంది. మీ ఫోన్లో లొకేషన్ తో ప్రారంభించబడిన గూగుల్ యాప్స్ కలిగి ఉంటుంది. ఫోన్ సెట్టింగ్స్ ను అనుమతించినట్లయితే...ఈ యాప్స్ ఉపయోగించినప్పుడు కూడా కంపెనీ డేటాను సేకరిస్తుంది. 
యాడ్స్ లక్ష్యంగా చేసుకుని డేటాను ఎలా ఉపయోగించాలో కూడా గూగుల్ వివరిస్తుంది. ఉదాహరణకు ఒక యూజర్ షాపులోకి వెళ్లేటప్పుడు చెక్ చేస్తే  ఎంత ప్రభావవంతంగా ఉందో లెక్కించవచ్చు. సంస్థ కూడా సమాచారాన్ని మొత్తం స్టోర్ చేస్తుంది. 
గూగుల్ ఇతర లొకేషన్ డేటాను సేకరిస్తుందా?
మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు లేదా లొకేషన్ లో ఉన్న గూగుల్ యాప్స్ ఉపయోగించినప్పుడు గూగుల్ లొకేషన్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరిస్తుంది. మీరు సైన్ ఇన్ చేసిన ఉన్నట్లయితే... ఈ డేటా మీ అకౌంట్ తో అసోసియేట్ చేయబడుతుంది. మీరు లొకేషన్ హిస్టరీని ప్రారంభించినప్పటికీ వెబ్ యాప్ యాక్టివిటీ పిలువబడే ఈ డేటాను సేకరించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. 
గూగుల్ లో మనకు సంబంధించిన డేటాను చూడటం ఎలా?
మీ లొకేషన్ హిస్టరీలో కొంత సమాచారాన్ని చూడటానికి...టైంలైన్ కాలమ్ ను చూడవచ్చు. మీ ట్రావెల్స్ మ్యాప్స్ లో సెన్సర్ వాల్ట్ డేటా అన్నింటికి కలిగి ఉండదు. మొబైల్ డివైజుల నుంచి రాలొకేషన్ డేటా తప్పుగా కూడా ఉండవచ్చు. కానీ కంప్యూటర్లు ఖచ్చితమైన లొకేషన్ను చూపిస్తుంది. ఏ లొకేషన్ ముఖ్యమైనది...అనేది టైంలైన్ లో చూపిస్తుంది. లొకేషన్ హిస్టరీని రివ్యూ చేయడానికి మీడేటాను గూగుల్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. takeout.goole.comకు వెళ్లి లొకేషన్ హిస్టరీని సెలక్ట్ చేసుకోండి. ఆ పేజీలో మీవెబ్ మరియు యాప్ యాక్టివిటీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
మీ లొకేషన్ హిస్టరీ డేటా కంప్యూట్లో కోడ్ రూపంలో కనిపిస్తుంది. కోడ్ చదవలేకపోతే మీరు JSON ఫార్మాట్ ను ఎంచుకుని ఫైల్ను ఒక టెక్ట్స్ ఎడిటర్ గా ఎలా ఉంటుందో చూడవచ్చు. 
డేటా కలెక్షన్ను డిజాబుల్ చేయవచ్చా?
చేయొచ్చు. మీ ఫోన్ లేదా కంప్యూటర్ పై ఆధారపడి ఉంటుంది. గూగుల్ లొకేషన్ హిస్టరీ మరియు వెబ్ యాప్ యాక్టివీటి నిలిపివేయడానికి లేదా తొలగించడానికి పలు సూచనలను అందిస్తుంది.  
డేటాను ఉపయోగించి చట్టం ఎలా అమలు చేస్తుంది?
కొన్ని సంవత్సరాలుగా పోలీసు డిటెక్టివులు కొంతమంది యూజర్ల అకౌంట్లకు డేటాను అనుసందించాలని కోరుతూ గూగుల్ కు వారెంట్లు ఇచ్చారు. కానీ కొత్త వారెంట్లను జియోఫెన్స్ అభ్యర్థనలుగా పిలుస్తారు. ఒక నేరానికి సంబంధించిన సమీప ప్రాంతాన్ని గురించి తెలుసుకుంటారు. ఆ సమయంలో డివైజుల ద్వారా  గూగుల్ సెన్సర్ వాల్ట్ లో కనిపిస్తుంది
 

జన రంజకమైన వార్తలు