టెక్ ప్రపంచంలో సరికొత్త వ్యూహాలతో ముందుకు దూసుకెళ్తోంది గూగుల్. దానికి తోడుగా సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తుంది. గూగుల్ మొదటితరం పిక్సెల్ స్మార్ట్ ఫోన్లతో...గూగుల్ బ్రాండింగ్ తో డివైజులను ప్రారంభించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి కంపెనీ ప్రారంభించిన కొన్ని డివైజులు యూజర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు గూగుల్ హోం స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ ఫోన్ల పిక్సెల్ శ్రేణిని అందిస్తూవస్తోంది. తాజాగా గూగుల్ ఈ ఏడాది మరో ఐదు సరికొత్త ఉత్పత్తులను ప్రారంభించనుంది. పిక్సెల్ 3 లైట్ సీరిస్, పిక్సెల్ 4, గూగుల్ హోం యొక్క కొత్త వెర్షన్, పిక్సెల్ స్మార్ట్ వాచ్ తోపాటు గూగుల్ సెక్యూరిటీ కెమెరాను లాంచ్ చేయనుంది.
పిక్సెల్ 3 లైట్, పిక్సెల్ స్మార్ట్ వాచ్ మార్కెట్లో రిలీజ్ అయినట్లు వస్తున్న వార్తలను గూగుల్ కొట్టిపారేసింది. హోం రిఫ్రెష్, పిక్సెల్ స్మార్ట్ ఫోన్లతోపాటు ఇతర ప్రొడక్టులను రిలీజ్ చేసేందుకు ఇంకొంత కాలం వేచి ఉండాలని గూగుల్ స్పష్టం చేసింది.
గూగుల్ ప్రొడక్షన్ లైనప్ ఫర్ 2019...
గతేడాది పిక్సెల్ 3 లైనప్ స్మార్ట్‌ఫోన్ను గూగుల్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ యాపిల్, శాంసంగ్ కంపెనీలకు గట్టి పోటీనిచ్చింది. ఈ ఏడాది పిక్సెల్ సీరిస్ లోనే పిక్సెల్ 4 స్మార్ట్‌ఫోన్ను అక్టోబర్ లో లాంచ్ చేయనుంది. ఆకట్టుకునే డిజైన్, అప్ గ్రేడ్ కెమెరాలతో ఈ ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ కానుంది. ఇక గూగుల్ పిక్సెల్ 3 లైట్ సీరిస్ కూడా ఈ ఏడాది మార్కెట్లోకి రానుంది. ఇందుల్ పిక్సెల్ 3 లైట్ , పిక్సెల్ 3లైట్ ఎక్స్ ఎల్ ఉన్నాయి. ఈ డివైజుల విడుదలకు సంబంధించిన వార్తలు ఎన్నోసార్లు ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్లను మే నెలలో రిలీజ్ చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది.
వీటితోపాటుగా గూగుల్ ఈ ఏడాది మరొక కొత్త ప్రొడక్టును మార్కెట్లోకి తీసుకురానుంది. గూగుల్ హోం స్పీకర్లను అప్ డేట్ చేస్తూ...అక్టోబర్ లో పిక్సెల్ 4తో కలిసి లాంచ్ చేయనుంది. పిక్సెల్ స్మార్ట్ వాచ్ రిలీజ్ గురించి ఇప్పటికి చాలా సార్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ వాచ్ , యాపిల్ స్మార్ట్ వాచ్ కు గట్టి పోటీ ఇవ్వనుంది. పిక్సెల్ స్మార్ట్ వాచ్ గూగుల్ సంస్థ నుంచి రిలీజ్ కానున్న మొట్టమొదటి వాచ్ గా నిలిచిపోనుంది.
ఇక గూగుల్ హోం సెక్యూరిటీ కెమెరా వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. నెస్ట్ అనే అమెరికన్ సంస్థ సహాకారంతో స్మార్ట్ హోం ప్రొడక్టులను తయారు చేయడానికి గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. కాగా గూగుల్ హోం సెక్యూరిటీ కెమెరా, గూగుల్ హోం ప్రొడక్టులు నెస్ట్ బ్రాండిగ్ తో రానున్నాయా?లేదా? అనే విషయాన్నిఅక్టోబర్ లో పిక్సెల్ 4 లాంచ్ కార్యక్రమంలో ప్రకటించనుంది గూగుల్.