మా సెర్చ్ ఇంజిన్ లో 45సార్లు సమాచారం కోసం సెర్చ్ చేస్తే...మేం ఒక మొక్క నాటుతాం. ఈ వార్తా చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఎకోసియా సెర్చ్ ఇంజిన్ ఈ పని చేస్తోంది. ఏదైనా వెబ్ సైట్ ఓపెన్ చేశాం అనుకోండి. అందులో ఉండే ప్రకటన వల్ల ఆ సెర్చ్ ఇంజిన్ కు డబ్బులు వస్తుంటాయి. అలా వచ్చిన సంపాదనలో నుంచి ఎనభైశాతం డబ్బును మొక్కలు నాటే బ్రుహత్తర కార్యక్రమానికి విరాళంగా ఇస్తోంది. మైక్రోసాఫ్ట్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని 15దేశాలలో 20ప్లస్ ప్రాజెక్టులకు ఎకోసియా మద్దతు తెలుపుతుంది. ఇథియోపియా, టాంజానియా, మొరాకో, హైతీ, ఇండోనేషియా, సెనెగల్, ఘనా, నికారాగువా, కొలంబో, కెన్యా, ఉగాండా లాంటి దేశాల్లో మొక్కలు నాటుతున్నారు. ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటారానే విషయం సెర్చ్ ఇంజిన్ హోం పేజీ మీద అప్ డేట్ అవుతుంది. ఎకోసియా వాడితే...సమాచార శోధనతోపాటు...సామాజిక సేవ కూడా చేయవచ్చు.
సెర్చ్ ఇంజిన్ తో మొక్కలు నాటడం...
సెర్చ్ ఇంజిన్ యొక్క హోం పేజీని ఓపెన్ చేసి....సెర్చ్ చేయండి. మీ అవసరాలకు అనుగుణంగా ఇన్ స్టాల్ చేసేందుకు క్రోమ్ ను పొడగిస్తుంది. హోంలో ఎకోసియా యూజర్లచే చెట్లను చూపించే రియల్ టైం కౌంటర్ కూడా ఉంటుంది. సెర్చ్ రిజల్ట్స్ పేజీలో ....మీకు కావాల్సిన సెర్చ్ నెంబర్ ను చూపించే సెర్చ్ కౌంట్ పైన కుడిభాగంలో ఉంటుంది. మీ బ్రౌజర్ కుక్కీలను క్లియర్ చేస్తే...ఈ కౌంటర్ అటోమెటిగ్గా రీసెట్ అవుతుంది.
సెర్చ్ ఫలితాల పేజీలో బింగ్, గూగుల్ తోపాటు ఇతర సెర్చ్ ఇంజిన్లకు సమానమైన వెబ్, ఇమేజ్ లు, న్యూస్, వీడియోలు, మ్యాప్స్ వంటి పలు విభాగాలు ఉంటాయి. వీటితోపాటుగా మీరు లొకేషన్ కూడా మార్చవచ్చు. గత వారం, గత నెల, గత సమయం లేదా ఏ సమయంలో ఫలితాలను ఫిల్టర్ చేయవచ్చు. కాబట్టి ఎకోసియా సెర్చ్ ఇంజిన్ వాడటం ప్రారంభించండి. చెట్ట పెంపకానికి సహాకరించండి.