క్రెడిట్ కార్డ్ శకంలో మరో కొత్త మార్పు. మీ ట్రాన్సాక్షన్లను, వాటి చెల్లింపులను మరింత సులభతరం చేసే ఇంటరాక్టివ్ క్రెడిట్ కార్డ్‌ను ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇండియాలో తొలిసారిగా ప్రవేశపెట్టింది. దీన్ని పుష్ బటన్ ఈఎంఐ క్రెడిట్ కార్డు అని ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రకటించింది. అసలు ఏమిటీ ఇంటరాక్టివ్ క్రెడిట్ కార్డ్? ఏమిటి దీని గొప్ప? తెలుసుకోవాలంటే ఓ లుక్కేసేయండి మరి.
ఏమిటీ ఇంటరాక్టివ్ క్రెడిట్ కార్డ్?
క్రెడిట్ కార్డ్‌లో పెద్ద అమౌంట్ యూజ్ చేసినప్పుడు దాన్ని ఒక్కసారి కట్టడం బర్డెన్ అనుకుంటే ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుని 3,6, 9,12 వాయిదాల్లో కట్టే సౌకర్యం ఉంది. కొన్ని బ్యాంకులు 3వేలకు పైన అమౌంట్‌ను, మరికొన్ని బ్యాంకులు 5వేలకు పైగా మొత్తాన్ని ఇలా ఈఎంఐలుగా మార్చుకోవడానికి అవకాశం ఇస్తాయి. అయితే ఇందుకోసం ఆ ట్రాన్సాక్షన్ పూర్తయిన నెల రోజుల్లోపు కస్టమర్ కేర్‌కు కాల్ చేసి దాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేయమని రిక్వెస్ట్ చెప్పాలి. దీనికోసం లైన్‌లో చాలాసేపు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇటీవల బ్యాంకింగ్ యాప్స్ వచ్చాక నేరుగా ట్రాన్సాక్షన్‌ను సెలెక్ట్ చేసి ఈఎంఐగా కన్వర్ట్ చేసే అవకాశం ఏర్పడింది. అయితే ఇంటరాక్టివ్ క్రెడిట్ కార్డ్ పేరుతో వచ్చిన కొత్త తరం క్రెడిట్ కార్డ్ ఈ ఇబ్బందిని కూడా తీర్చేసింది. పీవోఎస్ (స్వైపింగ్ మిషన్)లో కార్డ్ స్వైప్ చేసేటప్పుడే ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్‌ను ఈఎంఐగా మార్చాలా లేదా మార్చాలంటే ఎన్ని ఈఎంఐలుగా డివైడ్ చేయాలో ఈ కార్డ్ మిమ్మల్ని అడుగుతుంది. కార్డ్ పైన ఉండే పుష్ బటన్‌నొక్కి ఈఎంఐ కన్వర్షన్ చేసేసుకోవచ్చు. పెద్దగా టెక్నాలజీ వాడకం తెలియని క్రెడిట్ కార్డ్ యూజర్లకు కూడా ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవలన్నా చాలా హెడేకే. దాన్ని తీర్చడానికి కూడా ఈ ఇంటరాక్టివ్ క్రెడిట్ కార్డ్‌లో ఆప్షన్ ఉంది.
ఎలా పని చేస్తుంది?
ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇంటరాక్టివ్ క్రెడిట్ కార్డ్ కూడా మామూలు క్రెడిట్ కార్డ్‌లాగే ఉంటుంది. అయితే దీనిలో నాలుగు ఎల్ఈడీలు, మూడు ఇంటరాక్టివ్ బటన్స్ ఉంటాయి. EMI, Pay by Credit or Reward points అనే మూడు ఆప్షన్లను ఈ బటన్స్ చూపిస్తాయి.
రెస్టారెంట్, షాపింగ్, సర్వీస్ ఇలా ఎక్కడైనా స్వైపింగ్ మిషన్‌లో కార్డ్ పెట్టాక మీరు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.
Pay by Credit బటన్ నొక్కితే ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ మీ క్రెడిట్ బ్యాలన్స్‌లో నుంచి కట్ అవుతాయి.
Rewards బటన్ నొక్కితే మీకున్న రివార్డ్ పాయింట్స్ నుంచి ఆ అమౌంట్ కట్ అవుతుంది.
EMIలో కట్టాలనుకుంటే EMI బటన్ నొక్కాక పక్కన నాలుగు ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. అవి 6 months, 12 months, 18 months, 24 months. మీకు కావాల్సిన బటన్ నొక్కితే ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ అన్ని ఈఎంఐలుగా మారిపోతుంది. .
ఉపయోగం ఏంటి?
ప్రస్తుతం ట్రాన్సాక్షన్‌ను ఈఎంఐలుగా మార్చుకోవడంలో ఉన్న ఇబ్బందులన్నింటినీ దూరం చేయడం దీని లక్ష్యం. అలాగే రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేయడంలో ఉన్న చికాకులను కూడా తొలగిస్తుంది. అలా తమ క్రెడిట్ కార్డ్ నెక్స్ట్ జనరేషన్ క్రెడిట్ కార్డ్ అని ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రకటించింది.