ఇప్పుడు సోషల్ మీడియాలో దిగ్గజాల మధ్య టఫ్ ఫైడ్ నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అలాగే స్నాప్‌చాట్ ల మధ్య పోటీ చాలా తీవ్రంగానే ఉంది. ఈ పోటీని తట్టుకోవడానికి సరికొత్త ఫీచర్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో Threads అనే కొత్త అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇది బుడ్డి యాప్ మాదిరిగా డిజైన్ చేయనున్నారు. ఈ అప్లికేషన్ ద్వారా మనకు దగ్గరగా ఉన్న స్నేహితులతో speed, location, battery life ఇంకా ఇతర విషయాలను షేర్ చేసుకోవచ్చు.
వీటితో పాటుగా యూజర్లు సాధారణంగా షేర్ చేసుకునే photos, videos and text messages ని కూడా స్నేహితులతో పంచుకోవచ్చు. అయితే క్రియేటివ్ టూల్ ఉపయోగించి ఈ పనులు చేయవచ్చు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ బయటకు పొక్కనీయకుండా దాచింది. ఇదిలా ఉంటే కంపెనీ May, 2019 నుంచి డైరక్ట్ యాప్ మీద పనిచేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ సందేశాలను పంపడానికి వచ్చిన ఫస్ట్ కెమెరా మెసేజింగ్ యాప్ కూడా ఇదే. కంపెనీ దీన్ని 2017 డిసెంబర్లో లాంచ్ చేసింది. అప్పటి నుంచి డెవలప్ మెంట్ చేస్తూను ఉంది. చివరిగా May, 2019లో ఈ అప్లికేషన్ డెవలప్ మెంట్స్ ఆగిపోయాయి. 2019 జనవరిలో జుకర్ బర్గ్ స్థాపించిన Facebook, Whatsapp, Instagram ఇవి మూడు మెర్జ్ అయ్యాయి. ఈ మెర్జింగ్ ప్రాసెస్ లో ఇన్‌స్టాగ్రామ్ మెసేజింగ్ టీమ్ అంతా Facebook messaging teamలో భాగమయ్యారు.
ఇదిలా ఉంటే ఫేస్ బుక్ Snapchat నుండి అనేక రకాల ఫీచర్లను కాఫీ కొడుతున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. hands free video recording, wildly popular disappearing photos లాంటి ఫీచర్లు ఇప్పటికే Snapchatలో ఉన్నాయి. వీటిని ఫేస్ బుక్ అటు ఇటూగా మార్చి అందుబాటులోకి తీసుకువస్తోందని తెలుస్తోంది. ఇప్పుడు రానున్న Threads అప్లికేషన్ కూడా ఇందులో భాగమే. ఈ ఫీచర్ ద్వారా ఎప్పటికప్పుడు మీ స్నేహితులకి అప్ డేట్స్ అందుతుంటాయి. కాగా ఈ అప్లికేషన్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే దానిపై ఎటువంటి క్లారిటీ లేదు. అసలు వస్తుందా రాదా అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఫేస్ బుక్ ఇప్పుడు private messaging అప్లికేషన్ మీద ప్రధానంగా తన దృష్టిని పెట్టింది.