టెక్ కంపెనీలన్నీ ఫైనాన్షియల్ సర్వీసుల్లోకి అడుగుపెట్టి ఫిన్‌టెక్ కంపెనీలుగా మారుతున్నాయి. తాజాగా మొబైల్ వాలెట్ మొబీక్విక్ కూడా ఫైనాన్షియల్ రంగంలోకి అడుగుపెట్టింది. తమ యూజర్లకు 90 సెకండ్లలో లోన్లు ఇచ్చే ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ ఇన్‌స్టంట్ లోన్ ప్రోగ్రాం పేరు బూస్ట్.
ఎంత వరకు లోన్ ఇస్తారు?
ఈ బూస్ట్ ప్రోగ్రాం ద్వారా మొబీక్విక్ యూజర్లు 5వేల నుంచి 60 వేల వరకు లోన్ తీసుకోవచ్చు. ఎలాంటి పేపర్ వర్క్, కొల్లేటరల్ గ్యారంటీ అవసరం లేదు. లోన్ శాంక్షన్ అయితే ఆ వచ్చిన మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్‌కు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
లోన్ శాంక్షన్ చేయడానికి ఏం చూస్తారు?
మీరు లోన్‌కు అప్లయి చేయగానే లోన్ ఇవ్వచ్చో లేదో తెలుసుకోవడానికి మొబీస్కోర్‌ను ఉపయోగిస్తారు. ఇది పర్సనల్ లోన్స్ ఇవ్వడానికి మొబీక్విక్ సిద్ధం చేసిన స్కోరింగ్ మోడల్ ఇది.
లోన్ ప్రాసెస్ ఇదీ
1. మొబీక్విక్ యాప్ ఓపెన్ చేసి Boostను క్లిక్ చేయాలి.
2. బూస్ట్ అనే ఆప్షన్‌లో ఉన్న know more ని క్లిక్ చేయాలి. తర్వాత పేజీలో Yes, intrested అని ఉన్న బ్లూ కలర్ లింక్‌ను క్లిక్ చేయాలి.
3. ఇప్పుడు మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఉన్న ఆప్షన్‌లో టిక్ చేయాలి.
4. ఇప్పుడు మీకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటే లోన్ ఆఫర్ వస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తే మీ మొబీక్విక్ వాలెట్‌లోకి లోన్ అమౌంట్ వచ్చేస్తుంది.
రీపేమెంట్ ఎలా?
మొబీక్విక్‌లో తీసుకున్న లోన్‌ను 6 నుంచి 9 ఈజీమనీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (ఈఎంఐ)ల్లో కట్టాలి. మొబీక్విక్ వాలెట్ ద్వారాగానీ లేదా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ యాక్సెప్టెన్స్ ఇవ్వడం ద్వారా గానీ రీపేమెంట్ చేయొచ్చు.