• తాజా వార్తలు

వ‌న్‌ప్ల‌స్ క్లోవ‌ర్‌.. ఇక వార్ వ‌న్‌సైడేనా?

వ‌న్‌ప్ల‌స్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్ల హైఎండ్ మార్కెట్‌లో ఓ క్రేజ్ ఉంది. చైనా ఫోనే అయిన‌ప్ప‌టికీ దాదాపు యాపిల్ ఐఫోన్ స్థాయి ఫీచ‌ర్ల‌తో ఈ ఫోన్ ఉంటుంద‌ని యూజ‌ర్లు చెబుతుంటారు. అందుకు త‌గ్గ‌ట్లే ఈ వ‌న్ ప్ల‌స్ మోడ‌ల్స్  అన్నీ కూడా 30వేల పైన ధ‌ర‌లోనే ఉంటాయి. 60,70వేల రూపాయ‌ల మోడ‌ల్స్ చాలా ఉన్నాయి. అలాంటి వ‌న్‌ప్ల‌స్ తొలిసారిగా వ‌న్‌ప్ల‌స్ క్లోవ‌ర్ పేరుతో ఓ కొత్త స్మార్ట్‌ఫో‌న్‌తో బ‌‌డ్జెట్ ఫోన్ సెగ్మెంట్‌లోకి రాబోతుంద‌న్న వార్త‌లు చాలా ఆసక్తి క‌లిగిస్తున్నాయి.

బ‌డ్జెట్ ఫోన్లకు భారీ గిరాకీ
ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇండియాలో అంతా బ‌డ్జెట్ ఫోన్ల  హ‌వా న‌డుస్తోంది. అందుకే రియ‌ల్‌మీ, రెడ్‌మీ, నోకియా, శాంసంగ్ ఇలా అన్ని కంపెనీలు 10వేల లోపు ధ‌ర‌లో ఫోన్ల‌ను వ‌రుస‌పెట్టి మార్కెట్లోకి రిలీజ్ చేసేస్తున్నాయి.  ఏడాది కాలంగా ఒక్క కొత్త మోడ‌ల్‌ను కూడా మార్కెట్లోకి రిలీజ్ చేయ‌ని జియోనీ కూడా మార్కెట్లోకి కొత్త మోడ‌ల్తో వ‌చ్చిందంటే బ‌డ్జెట్ ఫోన్ల మార్కెట్ ఎలా ఉందో ఈజీగా అర్ధ‌మ‌వుతుంది.  ఇక ఇప్పుడు వ‌న్‌ప్ల‌స్ కూడా  వ‌స్తే రేసు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది. వ‌న్‌ప్ల‌స్ గ‌నుక 10,12వేల రూపాయ‌ల్లో ఈ వ‌న్‌ప్ల‌స్ క్లోవ‌ర్‌ను తీసుకొస్తే వార్ వ‌న్‌సైడే అవుతుందంటున్నారు వ‌న్‌ప్ల‌స్ ల‌వ‌ర్స్‌ 

ఫీచ‌ర్లు
* 6.52 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
* వెనుక‌వైపు ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌
* వెనుక వైపు మూడు కెమెరాల సెట‌ప్ 
* బ్యాటరీ: 6000 ఎంఏహెచ్‌
* స్నాప్‌డ్రాగన్‌ 460 ఎస్‌వోసీ చిప్‌సెట్‌
* 4 జీబీ ర్యామ్ 
* 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌

ధ‌ర ఎంత ఉండొచ్చంటే..
వ‌న్‌ప్ల‌స్ 8 యూఎస్‌లో 53,200 ఉంటే ఇండియ‌లో 42వేలే.  క్లోవ‌ర్‌ను అమెరికాలో 14వేల‌కు రిలీజ్ చేస్తార‌ని వార్త‌లొస్తున్నాయి. 
ఇండియాలో దాని ధ‌ర 12వేల వ‌ర‌కు ఉండొచ్చ‌ని.. కాదు 10వేల లోపే రిలీజ్ చేస్తార‌ని విశ్లేష‌ణ‌లున్నాయి. చూద్దాం ఏమవుతుందో..

జన రంజకమైన వార్తలు