డిజిటల్ మనీ ప్లాట్‌ఫామ్స్‌లో పేరెన్నికగన్న పేటీఎం తన బిజినెస్ యూజర్ల కోసం ఒక కొత్త డివైస్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది పేటీఎం చేతిలో బ్రహ్మాస్త్రం కాబోతోంది అని కంపెనీ చెబుతోంది. డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఇటీవల బాగా పెరిగాయి. టీ స్టాల్ నుంచి స్టార్ హోటల్ వరకు అన్ని చోట్ల డిజిటల్ ప్లాట్ఫారంను మనీ ట్రాన్సాక్షన్లకు విరివిగా వాడుతున్నారు. వీటిలో పేటీఎం అన్నింటికంటే ముందు స్థానంలో ఉంది. అయితే పేటీఎమ్ ద్వారా ట్రాన్సాక్షన్ అంగీకరించే రిటైలర్లకు దీంతో కొన్ని సమస్యలు ఉన్నాయి. కస్టమర్ పేటీఎంతో పే చేసినప్పుడు అతను తన ఫోన్ స్క్రీన్ మీద ట్రాన్సాక్షన్ సక్సెస్ ఫుల్ అయిందని వచ్చిన మెసేజ్ ను రిటైలర్‌కు చూపిస్తాడు. దీన్ని కన్ఫామ్ చేసుకోవడానికి రిటైలర్ తన మొబైల్ కి మెసేజ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ చెకింగ్ ప్రాసెస్ టైం తినేస్తుంది అని రిటైలర్లు కంప్లైంట్ చేస్తుంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నప్పుడు ఇది మరింత ఇబ్బందిగా మారుతుందని వాళ్లు పేటీఎంకు ఫీడ్ బ్యాక్ కూడా ఇచ్చారు.
పోర్టబుల్ డివైస్‌తో పని ఈజీ
పేటీఎం ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించింది. పేమెంట్ రిసీవ్ అవ్వగానే కన్ఫర్మేషన్ మెసేజ్ చెప్పేందుకు ఒక పోర్టబుల్ డివైజ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి పేటీఎం సౌండ్ బాక్స్ అని పేరు పెట్టింది. ఏడాదికి 649 రూపాయలు చెల్లించి రిటైలర్ దీన్ని తీసుకోవచ్చు.
పేటీఎం సౌండ్ బాక్స్ ఉపయోగాలు ఏమిటి?
పేమెంట్ కన్ఫర్మేషన్ అవ్వగానే వాయిస్ మెసేజ్ వినిపిస్తుంది.
* దీంతో షాపు వాళ్లకు కస్టమర్ మొబైల్ స్క్రీన్ మీద పేటీఎం కన్ఫర్మేషన్ చూసుకోవడం లేదా తన మొబైల్లో పేటీఎం మెసేజ్ చేసుకోవడం అక్కర్లేదు. కాబట్టి టైం సేవ్ అవుతుంది.
* పేటీఎం సౌండ్ బాక్స్ మీద క్యూఆర్ కోడ్ స్టిక్కర్ కూడా ఉంటుంది. కాబట్టి ట్రాన్సాక్షన్ కోసం విడిగా స్టిక్కర్ వేరేచోట పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.
* డివైస్ చూడడానికి చాలా ట్రెండీగా కూడా ఉంటుంది కాబట్టి బిల్ కౌంటర్ దగ్గర పెట్టుకోవడానికి పెద్ద షోరూమ్ వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తున్నారు
* ఇటీవల చాలామంది రిటైల్ యూజర్లు తమ షాపులు, హోటళ్ళు, రెస్టారెంట్లు ఇతర అ బిజినెస్ పాయింట్ల వద్ద ఈ పేటీఎం సౌండ్ బాక్స్ ఉపయోగిస్తున్నారు.
* ఫోన్ పే అమెజాన్ పే, మొబీక్విక్ లాంటి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ తో పోల్చితే పేటీఎం ఈ విషయంలో ముందడుగు వేసినట్లే.