టెక్నాలజీ రంగం సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చూడుతోంది. భవిష్యత్ మొత్తం కూడా టెక్నాలజీ చుట్టే తిరుగనుంది. తొలిరోజుల్లో ఒకగదిలో పట్టేంత కంప్యూటర్...కానీ ఇప్పుడు తన గుప్పెట్లో పెట్టుకుని మన జేబుల్లో ఇమిడిపోయింది. అనేక సాంకేతి ఆవిష్కరణలు మన కళ్ల ముందు కదలాడుతున్నాయి. అదే క్రమంలో ప్రపంచ గతినే మర్చుతోన్న మరోక సాంకేతి ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చార్యానికి గురిచేస్తోంది. గుండు సూది నంచి గుండె వరకు ప్రతీదీ క్రియేట్ చేయగల అద్భుత సాంకేతి పరిజ్ఞానం మనముందుంది. అదే త్రీడీ ప్రింటింగ్. ఈ త్రీడీ ప్రింటింగ్ ద్వారా ఆహార పదార్థాల నుంచి బిల్టింగులను నిర్మించండం ఒక ఎత్తు అయితే...మావన శరీర అవయవాలను క్రియేట్ చేయడం మరో వింత.
తాజాగా ఇజ్రాయోల్ శాస్త్రవేత్తలు, మానవ కణజాలం, నాళాలు, గుండె యొక్క 3డి ప్రింటిన్ ను ఆవిష్కరించారు. ఇది ట్రాన్స్ ప్లాంట్స్ డేవలప్ కోసం రూపొందించిన ప్రధాన వైద్య పురోగతని చెప్పవచ్చు.
రక్తనాళాలు, జఠరికలు, గుండె గదులతో నిండిన మొత్తం గుండెను విజయవంతంగా రూపొందించారు. కుందేలు యొక్క గుండె పరిమాణంలో దీనిని తయారుచేశామని టెల్ అవీవ్ యూనివర్సిటీ కి చెందిన తాల్ డివిర్ ప్రాజెక్ట్ కు లీడర్ గా పనిచేశారు. గతంలోనూ గుండె యొక్క నిర్మాణం 3డి ప్రింటింగ్ కోసం పనిచేశారు. కానీ కణాలు లేదా రక్తనాళాలతో తయారు చేయాలేదని చెప్పాడు. కానీ శాస్త్రవేత్తలు 3డి ప్రింటింగ్ గుండెలను రోగులకు మార్పిడి చేయడానికి అనేక సవాళ్లలను ఎదుర్కోవల్సి వస్తుందన్నారు. టెల్ అవిన్ యూనివర్సిటీలో చెర్రీ పండు పరిమాణంలో ఉన్న గుండె యొక్క 3డి ప్రింటింగ్ ను మీడియా ముందుకు తీసుకువచ్చారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనలకు గురించి వెల్లడించారు. రానున్న పదేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు పొందిన ఆసుపత్రులలో అవయవ ప్రింటర్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.