ఇప్పుడు టిక్‌టాక్ యూత్‌ను ఊపేస్తోంది. దాదాపు ప్రతి ఫోన్లోనూ ఈ యాప్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. యూత్ ఈ యాప్‌కు ఎంతగా అలవాటు పడిపోయారంటే కాలేజ్‌లోనూ ఎక్కడికి వెళ్లినా వదలట్లేదు. అయితే టిక్‌టాక్ గురించి అందరికి పూర్తిగా తెలియదు. ఇది కేవలం వీడియోలు చేసే యాప్ మాత్రమే అనుకుంటారు. కానీ దీని ద్వారా ఆన్‌లైన్ వ్యూవర్ సెర్చ్, వీడియోస్ డౌన్‌లోడ్ లాంటి ఆప్షన్లు ఉన్నాయని మీకు తెలుసా.. అంటే మనకు నచ్చిన వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షేర్ చేసుకోవచ్చు. మనకు ఇష్టమైన టిక్‌టాక్ స్టార్ల గురించి సెర్చ్ చేయచ్చు. మరి ఇదెలాగో చూద్దాం..
సెర్చ్‌బార్ ద్వారా.
టిక్‌టాక్‌లో సెర్చ్‌బార్ ఆప్షన్ ఉంటుంది. దీనికి మీరు యూజర్ నేమ్, హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ర్యాండమ్‌గా ఏదో ఒక యాష్ ట్యాగ్ డ్రాప్ చేస్తే మీరు అనుకునే కొన్ని సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. దానిలోంచి మీరు ఎంచుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల మీరు వెతికే యూజర్లను కూడా కనుగొనే అవకాశం ఉంటుంది. అంతేకాక వాళ్లు చేసిన వీడియోలను కూడా మీరు రీ క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది.
ఆన్‌లైన్ వ్యూవర్
టిక్‌టాక్ ఆన్‌లైన్ వ్యూవర్ ద్వారా మీరు ఎలాంటి లాగ్ ఇన్ లేకుండానే వీడియోలను వీక్షించే అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా మనకు సమయాన్ని ఆదా చేస్తుంది. అంతేకాదు మన పర్సనల్ డిటైల్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంతేకాదు ఈ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన వీడియోలను హ్యాష్‌ట్యాగ్, యూజర్ నేమ్స్, ట్రెండింగ్ లాంటి వాటితో సెర్చ్ చేసుకునే వీలుంది. ప్రతి హ్యాష్ ట్యాగ్‌కు వందల కొద్దీ వీడియోలు ఉంటాయి. మీకు కావాల్సిన పర్టిక్యులర్ వీడియోను ఆ హ్యాష్ ట్యాగ్ పెట్టి పేరు పెట్టి వెతికితే చాలు.