యూట్యూబ్‌లో కోట్ల సంఖ్యలో వీడియోలు ఉంటాయి,.. కానీ అందులో పనికొచ్చేవి మనం ఎంచుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు పనికొచ్చే వీడియోలు యూట్యూబ్‌లో బాగానే ఉంటాయి. కానీ వాటిలో వేటిని ఎంచుకోవాలనేదే సమస్య. ఒకవేళ ఎంచుకున్నాఅన్నిటిని డౌన్‌లోడ్ చేసుకోలేం. ఇలాంటి ఇబ్బంది నుంచి బయటపడటానికి.. యూట్యూబ్ వీడియోలను ఒక పుస్తక రూపంలో మనకు అందించడానికి ఒక యాప్ ఉంది.. దాని పేరే రెవిట్. మరి ఈ యాప్‌ను ఎలా యూజ్ చేయాలో చూద్దామా.,..
2000 పుస్తకాలు
యూట్యూబ్‌లో ఉన్న పాపులర్ వీడియోలను బుక్స్‌గా కన్వర్ట్ చేయడానికి ఈ రెవిట్ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఆ బుక్‌ను స్టోరీ బుక్ మాదిరిగా చదువుకోవచ్చు. ఇప్పటికే ఈ యాప్ 2000 వీడియోలను పుస్తకాలుగా మార్చి పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది. పాపులర్ యూట్యూబర్స్‌తో టై అప్ చేసుకున్న రెవిట్ యాప్... ఈ వీడియోలను పుస్తకాలుగా కన్వర్ట్ చేసింది. పిల్లలకు రీడింగ్ హాబిట్‌ను పెంచేందుకే తామీ ప్రయోగం చేసినట్లు ఈ యాప్ సృష్టికర్తలు చెప్పారు. విశేషం ఏమిటంటే ఆ వీడియోల్లో ఏ ఇమేజ్‌లు ఉన్నాయో ఈ పుస్తకాల్లోనూ అవే ఇమేజ్‌లు ఉంటాయి.. దీని వల్ల పిల్లలు సులభంగా పుస్తకాలను చదువుతారు.. మళ్లీ చదవడానికి ఇష్టపడతారు.
ఎలా వాడాలంటే..
గూగుల్ ప్లే స్టోర్ నుంచి రెవిట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. గూగుల్ అకౌంట్‌ను యూజ్ చేసుకుని సైన్ ఇన్ అవ్వాలి. ఆ తర్వాత స్క్రీన్ మీద చూపించినట్లుగా నెక్ట్ బటన్ క్లిక్ చేస్తూ ముందుకెళ్లాలి. పేరెంటల్ కంసెంట్ (పెద్దల అనుమతి) ఇది అడుగుతుంది. దాన్ని కూడా ఒకే చేయాలి. మీ పిల్లల కోసం ఒక ప్రొఫైల్‌ను క్రియేట్ చేయాలి. పిల్లల పేరు, బర్త్ డేట్, లాంగ్వేజ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పిల్లల ఏజ్‌ను బట్టి లెవల్‌ను ఎంపిక చేసుకోవాలి. అంతే మీ పిల్లల ప్రొపైల్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత యాప్ ఆడియో రికార్డు కోసం పర్మిషన్ అడుతుంది. అదీ ఒకే చేయాలి. .. ఆ తర్వాత మీకు యూట్యూబ్ బుక్స్ కనిపిస్తాయి. ఇందులో చాలా కేటగిరిలు ఉంటాయి. మీకు నచ్చిన వాటిని ఎంచుకుని చదువుకోవచ్చు.