వాట్సాప్‌కి పోటీగా తీసుకొచ్చిన ఇండియా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ .. ఇప్పుడు ఓ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటివి స్టోర్ చేసుకుని ఎక్కడి నుంచయినా దాన్ని వాడుకోవడానికి పాస్‌పోర్ట్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండడంతో ఈ డేటా ఎటూ పోతుందనే భయం అక్కరలేదని టెలిగ్రామ్ ప్రకటించింది.
భద్రతకు నో ఫికర్
వాట్సాప్‌లో విదేశీ మెసేజింగ్ సర్వీస్ అని, టెలిగ్రామ్ ఇండియన్ మేడ్ కాబట్టి టెలిగ్రామ్‌నే వాడాలని చాలామంది దీన్ని వాడుతున్నారు. వాట్సాప్‌లాగానే దీన్ని కూడా పీసీలో కూడా వాడుకోవచ్చు. వాట్సాప్‌లో ఇమేజ్ పంపిస్తే సైజ్ దానంతటదే తగ్గిపోయి వస్తుంది. కానీ టెలిగ్రామ్‌లో అలాంటి ఇబ్బంది లేదు. ఎంత ఫైల్ అయినా ఒరిజినల్ సైజ్‌లోనే సెండ్ చేసుకోవచ్చు. అందుకే డాక్యుమెంట్స్, ఫోటోలు, వీడియోలు పంపడానికి టెలిగ్రామ్ బాగా ఉపయోగపడుతోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా పాస్‌పోర్ట్ ఫీచర్‌తో మన డాక్యుమెంట్స్‌ను సేవ్ చేసుకునే అవకాశం ఇవ్వడంతో టెలిగ్రామ్ వాట్సాప్ కంటే ఓ అడుగు ముందుకు వేసినట్లే. మెసేజ్‌లు పంపినట్లే చాలా భద్రంగా మీ ఐడీ కార్డ్‌లు, డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోవచ్చని, వాటిని ఎవరికైనా పంపాలంటే యాప్ నుంచే షేర్ చేసుకోవచ్చు.
ఏమేం దాచుకోవచ్చు?
పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ లాంటి ప్రూఫ్‌లన్నీ స్కాన్ చేసి లేదా ఈ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుని టెలిగ్రామ్ పాస్‌పోర్ట్‌లో సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫోన్ నెంబర్,ఈ మెయిల్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు కూడా సేవ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో వీటిని ఓ డీసెంట్రలైజ్డ్ క్లౌడ్‌లోకి టెలిగ్రామ్ మూవ్ చేస్తుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైస్‌ల్లో కూడా ఈ ఫీచర్ పని చేస్తుంది. టెలిగ్రామ్ 4.9 వెర్షన్ యాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోవడానికి గైడ్
1. ePayments.com/tgలోకి వెళ్లి Sign up with Telegramని క్లిక్ చేయాలి
2. ఈ లింక్ మిమ్మల్ని టెలిగ్రామ్ యాప్‌లోని పాస్‌పోర్ట్ సెక్షన్‌కు తీసుకెళుతుంది. ఇక్కడ మీరు పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్‌వర్డ్ హింట్, రికవరీ ఈ మెయిల్ అడ్రస్ కూడా ఇవ్వాలి.
3. ఇది పూర్తవగానే ఈమెయిల్‌కు పంపిన వాలిడేషన్ లింక్ క్లిక్ చేస్తే టూ స్టెప్ వెరిఫికేషన్ పూర్తవుతుంది.
4. అనేబుల్ కాగానే మీ పర్సనల్ డిటెయిల్స్, డాక్యుమెంట్స్ ఫిల్ చేసి Authorize బటన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ డేటా స్టోరవుతుంది. దాన్ని ఎవరికైనా షేర్ చేయడానికి సిద్ధంగా ఉంది.
5. డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేశాక దాన్ని యాక్సెస్ చేయాలంటే Settings > Privacy & Security > Telegram Passport లోకి వెళ్లాలి.