• తాజా వార్తలు

ప్రివ్యూ - ఈ నెలలో రానున్న 16 సరికొత్త ఫోన్లు మీకోసం

స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు క్యూ కడుతున్నారు. ఆయా కంపెనీలకు చెందిన డివైజులతో మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీతో ఇతర ఫోన్లకంటే తమ ఫోన్లు అత్యుత్తమైనవిగా నిరూపించేందుకు సరికొత్త డిజైన్లు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో మార్కెట్లో పోటీ పడేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నెలలో మార్కెట్లో రిలీజ్ కు సిద్దంగా ఉన్న కొన్నిస్మార్ట్ ఫోన్‌ల జాబితా మీకోసం. 

SUMSUNG...
శాంసంగ్ కంపెనీ ఇప్పటికే గెలాక్సీ M10,M20 స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది.ఇప్పుడు సరికొత్తగా ఫిబ్రవరి 27న గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.గెలాక్సీ M30లో ఫుల్  హెచ్‌డీ ప్లస్ 6.4 అంగుళాల AMOLED స్క్రీన్ ఉంటుంది.ఈ ఫోన్ అమెజాన్లో ఎక్సూక్లూజివ్ గా అందుబాటులోఉండనుంది.శాంసంగ్ గెలాక్సీ s10,s10+ ఈ స్మార్ట్ ఫోన్లను ఫిబ్రవరి 20న మార్కెట్లోకి రిలీజ్ చేయబోతోంది.అడిషనల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతోపాటు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉంటుంది. గెలాక్సీ s10e స్మార్ట్ ఫోన్‌ కూడా ఈ నెలలోనే రిలీజ్ కానుంది.ఇక శాంసంగ్ గెలాక్సీ s10,5జీ ఫోన్లతోపాటు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను కూడా ఫిబ్రవరి 20న ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. 

XIAOMI...
ఇండియాలో మధ్యస్థ శ్రేణి కొనుగోలుదారులకు షియోమీ ఎంతో ప్రియమైంది.తక్కువ ధరతో అదరగొట్టే ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. శాంసంగ్ కంపెనీ గట్టి పోటీనిస్తోంది. ఈ మధ్యే నోట్ 5ప్రో రిలీజ్ చేసిన కంపెనీ...తాజాగా  రెడ్ మీ నోట్ 7 స్మార్ట్ ఫోన్‌ను ఇండియాలో ఫిబ్రవరి 28న రిలీజ్ చేయనుంది. రెడ్ మీ నోట్7 ప్రోను కూడా అదే రోజు ఆవిష్కరించనుంది. 

SONY....
 ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారి సోనీ తన నూతన స్మార్ట్ ఫోన్‌ను ఈనెలలోనే విడుదల చేయనుంది.  మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2019 వేదికగా సోనీ ఎక్స్ పీరియా xz24 స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 
VIVO...
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్ సెట్ తయారీదారి సంస్థ వీవో...ఫిబ్రవరి 20న వి15ప్రో స్మార్ట్ ఫోన్‌ లాంచ్ చేయనుంది.ఈ హ్యాండ్ సెట్ ధర 30వేలుగా నిర్ణయించింది కంపెనీ. ఈ స్మార్ట్ ఫోన్‌ వన్ ప్లస్ 6T,శాంసంగ్ గెలాక్సీ A9లతో పోటీ పడనుంది. 
OPPO...
చైనా మొబైల్ దిగ్గజ సంస్ధ ఒప్పో...తన నూతన స్మార్ట్ ఫోన్‌ ఒప్పో F11ప్రో కూడా ఈ నెలలోనే ఇండియా మార్కెట్లో రిలీజ్ చేయనుంది. 
LG...
 సౌత్ కొరియా బ్రాండ్ అయిన ఎల్ జి మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఫిబ్రవరి 24న వరల్డ్ వైడ్ గా LG G8 థింక్ స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్‌ OLED స్క్రీన్ తో వస్తుంది. 
HUAWEI...
 చైనా స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం హువాయి...ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. 
NOKIA... 
ఫిన్లాండ్ దిగ్గజ సంస్థ నోకియా ఈ ఏడాది పలు కొత్త స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. తాజాగా నోకియా 9 స్మార్ట్ ఫోన్‌ను ఫిబ్రవరి 24న MWCలో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 5 బ్యాక్ కెమెరాలు ఈ ఫోన్‌కు హైలెట్ గా నిలవనున్నాయి. 
XIAOMI...
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారి సంస్థ...షియోమీ ఎంఐ 9 స్మార్ట్ ఫోన్‌ ఫిబ్రవరి 24న  ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే దీని ధరను వెల్లడించలేదు. 
ONEPLUS...
స్మార్ట్ ఫోన్‌ లవర్స్ కు వన్ ప్లస్ నిత్యవసరంగా మారిన రోజులివి. ఈ కంపెనీ ఈ మధ్యే కొత్త డిజైన్ స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది.ఇప్పుడు వన్ ప్లస్ 5జి ప్రోటోటైప్ స్మార్ట్ ఫోన్‌ను mwcలో లాంచ్ చేయనుంది కంపెనీ. 


 

జన రంజకమైన వార్తలు