కంప్యూటర్‌లో గారడీ విద్య అంటారు ఫొటోషాప్‌ను! ఎందుకంటే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు సృష్టించడం ఈ సాంకేతికత ప్రత్యేకత. అడోబ్ ఫొటోషాప్ ఆరంభానికి ప్రస్తుత వెర్షన్‌కు అసలు పొంతనే లేదు. ఎన్నో మార్పులొచ్చేశాయి. గతంలో ఫొటోషాప్ టెక్నాలజీలో ఉన్న ఇబ్బందులను తొలగించి కొత్త కొత్త ఆప్షన్లతో ముందుకొచ్చింది. ముఖ్యంగా కొన్ని ఫొటో షాప్ యాప్‌లు అద్భుతంగా ఉంటున్నాయి. వాటిలో ఫొటోషాప్ ఎక్స్‌ప్రెస్, ఫిక్స్, మిక్స్, స్కేచ్, లైట్ రూమ్ లాంటివి ఉన్నాయి. మరి ఈ కొత్త యాప్‌లు ఏంటో తెలుసుకుందామా!
ఫొటోషాప్ ఎక్స్‌ప్రెస్
అడోబ్ ఫొటోషాప్‌లో వచ్చిన తొలి పెద్ద అటెంప్ట్ ఫొటోషాప్ ఎక్స్‌ప్రెస్. దీన్ని మొబైల్ యాప్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చాలారోజులుగా ఇది అందరికి అందుబాటులో ఉంది. దీనిలో బేసిక్ ఎడిటింగ్ టూల్స్, రీసైజింగ్, క్రాపింగ్, ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్స్, ఆర్ ఏడబ్ల్యూ ఇమేజ్ సపోర్ట్ లాంటి ఆప్షన్లు దీనిలో ఉన్నాయి. ఇది బేసిక్ మొబైల్ ఇమేజ్ ఎడిటర్‌గా చెప్పుకోవచ్చు.
ఫొటోషాప్ ఫిక్స్
ఫొటోషాప్ ఫిక్స్ ద్వారా ఇమేజ్‌ను రిటచింగ్, రీస్టోరింగ్ ఫీచర్లు దీనిలో ఉన్నాయి. మొబైల్ యాప్‌గా ఇది దొరుకుతుంది. దీని సాయంతో ఫేసియల్ ఫీచర్స్ షేప్స్‌ను అడ్జెస్ట్ చేసుకోవచ్చు. దీనికి లిక్విఫై అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. స్కిన్‌ను షార్పెన్ చేయడానికి, ఇమేజ్ బర్న్ చేయడానికి ఈ ఫిక్స్ మీకు ఉపయోగపడుతుంది. బ్రైటెనింగ్, కాంట్రాస్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఫొటోషాప్ మిక్స్
ఫొటోషాప్ మిక్స్ కూడా ఈ టెక్నాలజీలో వచ్చిన మరో యాప్. లే ఔట్ డిజైన్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. మీ ఇమేజ్‌లో ఉన్న అబ్జెక్ట్స్‌ని రిమూవ్ చేయడానికి... రీప్లేస్ చేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. బేసిక్ ఇమేజ్ ఎడిటింగ్, భిన్నమైన ఇమేజ్‌లను ఒకే ఇమేజ్‌లా కలిపి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ చేయడమే ఈ మిక్స్ స్పెషల్.
ఫొటోషాప్ స్కెచ్
ఫొటోషాప్‌లో ఉన్న మరో ఆప్షన్ ఇది. ఇది ఫొటోషాప్ పెయింటింగ్ ఇంజన్. మీకు ఫొటోషాప్‌లో ఉన్న బ్రష్ ఫీచర్లు తెలిసుంటే అవే స్కెచ్‌లో కూడా ఉన్నాయి. మీరు భిన్నమైన బ్రష్‌లు దీనిలో ఉపయోగించొచ్చు.బ్రష్ ఎఫెక్ట్స్ సాయంతో కలర్, ఒపాసిటీ లాంటి ఆప్షన్లు పొందొచ్చు. షేప్స్ సాయంతో మీరు ఎంతో ప్రత్యేకమైన ఇమేజ్‌లు తయారు చేసుకోవచ్చు.