• తాజా వార్తలు

ప్రివ్యూ - ఎలక్షన్ కమిషన్ వారి ఓటరు టర్నవుట్ యాప్ ఏం సాధించనుంది?

లోకసభ ఎన్నికల రెండో దశలో ఎక్కడెక్కడ ఎంత ఓటరు టర్నవుట్ ఉందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. కేంద్ర ఎన్నికల సంఘం...ఒక కొత్త యాప్ ను తీసుకొచ్చింది. తాజాగా ఓటరు టర్నవుట్ యాప్ ను ప్రవేశపెట్టింది ఈసీ. దీని ద్వారా ఎక్కడెక్క ఎంత టర్నవుట్ ఉందో పోలింగ్ రోజుల రియల్ టైంలో తెలుసుకోవచ్చు. 

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్లేస్టోర్ లో అందుబాటులో ఉంది. ఓటర్ టర్నవుల్ యాప్ ప్రస్తుతం బీటా వెర్షన్ లో ప్రజలకు అందుబాటులో ఉంది. ECI నా ఓట్ అనే యాప్ ను ఇదివరకే అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ యాప్ సరిగ్గా పనిచేయలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అందువల్లే ఓటర్ టర్నవుట్ యాప్ ని బీటా వెర్షన్ లో తెచ్చింది. ప్రజల నుంచీ వచ్చే సూచనలకు తగినట్లుగా మార్పులు చేయబోతున్నట్లు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సెనా తెలిపారు.  

ఓటర్ టర్నవుట్ గురించి నిరంతరం ఈ యాప్ ద్వారా నియోజకవర్గ స్థాయిలో సమాచారం చేరుతుందన్నారు. ఈయాప్ రియల్ టైం సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. అంతేకాదు ఎన్నికలు ముగియగానే...పురుష, మహిళ ఓటర్ల ఫిగర్ కూడా అందుబాటులో ఉంటుదని తెలిపారు. 
 

జన రంజకమైన వార్తలు