దేశీయ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ యూజర్ల కోసం ఇంటర్నెట్ టీవీ సర్వీస్ ను లాంచ్ చేసింది. గతంలో ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ పేరుతో DTH సర్వీస్ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఎయిర్‌టెల్ రోజు వారి వినియోగదారుల కోసం DTH కంటెంట్ తో పాటుగా ఇంటర్నెట్ కంటెంట్ ను కూడా క్లబ్ చేయనుంది. ఇప్పుడు ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీలో లభిస్తున్న బెస్ట్ ఫీచర్లను ఓ సారి చూద్దాం.
ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ కొనుగోలుదారులు, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి కంటెంట్ కి యాక్సిస్ తో పాటు DTH ఛానళ్ళకు గా అడిషనల్ యాక్సిస్ పొందుతారు దీంతో పాటు ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ ఇన్ బిల్ట్ గా Chromecast ను పొందుతుంది, దీని వలన వినియోగదారులు వారి మొబైల్ ఫోన్ల నుండి కూడా కంటెంట్ను ప్రసారం చేయగలరు.ఈ డివైస్ 4K మద్దతును అనుమతిస్తుంది.
ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ డ్యూయల్ కోర్ ARM B15 BCM7252S చిప్సెట్ను కలిగి ఉంది అలాగే MPEG-2, MPEG-4, H.265, H.264, MC, VC-1, VP9, AVI, MP-4, FLV, 3GP, WMV, MOV, MP4 మరియు MKV వంటి మీడియా ఫార్మట్స్ కు సపోర్ట్ చేస్తుంది.
ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ సెట్-టాప్ బాక్స్ మీ షోస్ రికార్డ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది,స్క్రీన్ను ప్రతిబింబిస్తుంది, దీని వలన మీరు మీకు కావాల్సిన షోలను చూడవచ్చు.మీరు కావాలంటే పెద్ద స్క్రీన్ పైన ఆండ్రాయిడ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఒకవేళ మీరు షోలను రికార్డ్ చేయాలనుకుంటే, మీరు మైక్రో SD కార్డ్ ద్వారా 128GB వరకు మెమొరీ పొడిగింపుకు మద్దతిస్తున్నందున మీరు STB లో అలా చేయగలుగుతారు.
కనెక్టివిటీ కొరకు, మీరు ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ బాక్స్ ను Wi-Fi లేదా ఈథర్నెట్ ద్వారా కనెక్ట్ చేయగలుగుతారు. ప్రస్తుతం ఎయిర్టెల్ సర్వీసు రూ.3,499 ధరకే ఉంది. ఈ ధర కూడా ఎరోస్ నౌ మరియు DTH యొక్క ఒక నెల కంటెంట్ బండెల్ కలిగి ఉంటుంది.