స్మార్టు ఫోన్ల మార్కెట్లో దూసుకుపోతున్న శాంసంగ్ త్వరలో ఫ్లిప్ ఫోన్లను విడుదల చేయనుంది. అది కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో.. ఎస్‌ఎం-జి9298 పేరిట శాంసంగ్ త్వరలో ఈ కొత్త ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్‌లో 4.2 ఇంచ్ సైజ్ కలిగిన రెండు డిస్‌ప్లేలు ఉంటాయి.
ఫీచర్ ఫోన్ల కాలంలో పలు కంపెనీలు ఫ్లిప్ ఫోన్లతో ఆకట్టుకున్నాయి. అయితే... స్మార్టు ఫోన్లు వచ్చేసి, పెద్దపెద్ద డిస్ ప్లేలు వచ్చాక ఫ్లిప్ ఫోన్లు ఆగిపోయాయి. మళ్లీ శాంసంగ్ ఇప్పుడు ఫ్లిప్ ఫోన్ ను తీసుకొస్తోంది.
స్పెసిఫికేష్లు ఇలా..
4.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డ్యుయల్ డిస్‌ప్లేలు
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.15 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.1 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ
2300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్