• తాజా వార్తలు

బ్లాక్ స్మార్ట్‌ఫోన్లు బోర్ కొడుతున్నాయా, కంపెనీల వ్యూహం ఏంటో చూడండి 

స్మార్ట్‌ఫోన్ల వాడే యూజర్లకు నలుపు రంగు స్మార్ట్‌ఫోన్లు అంటే బోర్ కొడుతున్నాయా అనే దానికి కంపెనీలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.ఇందులో భాగంగా దిగ్గజ కంపెనీలు అన్నీ నలుపు రంగులో కాకుండా ఇతర రంగుల్లో తమ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్10ని Canary Yellow, Flamingo Pink రంగుల్లో తీసుకువచ్చింది. ఇక మరో ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ ని Martian Green కలర్ లో తీసుకువస్తోంది. ఇక చైనా దిగ్గజం వన్ ప్లస్ కంపెనీ తన ఫ్లాగ్ షిప్ ఫోన్  OnePlus 6Tని Thunder Purple రంగులో తీసుకువచ్చింది. టెక్ విశ్లేకులు , ఫోన్ ఎక్సపర్టులు చెబుతున్న ప్రకారం ప్రతి యూజర్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు సమయంలో కెమెరా, బ్యాటరీ, స్క్రీన్ చూస్తారని తెలుస్తోంది. కాగా ప్రొడక్ట్ తయారీదారులు, మార్కెటర్లు మాత్రం కలర్ కు యూజర్లు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెబుతున్నారు. 

మనం ఇక్కడ ఓ చిన్న లాజిక్ ఆలోచిస్తే.. రానున్న అన్నీ స్మార్ట్‌ఫోన్లు ఫ్యాన్సీ పేర్లతో వస్తున్నాయి. దీనిని ఉదాహరణగా Jet Black, Phantom Blue and Prism White,simply black, blue and whiteలను చెప్పుకోవచ్చు. ఇక్కడ వైట్ కూడా ప్రాధాన్యతలో ఉంది.మార్కెట్ నిపుణుల ప్రకారం కలర్ కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటోందని యూజర్లు ఇప్పుడు కలర్ పుల్  స్మార్ట్‌ఫోన్ల వైపు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. ప్రొడక్ట్ అమ్మే వారు కూడా మీ దృష్టికి ఈ విషయం వచ్చిందని చాలామంది కూడా కలర్ గురించే చెప్పారని చెబుతున్నారు.రంగులు అనేవి జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాయని కాబట్టి ఫోన్ ని కూడా తమకు నచ్చిన రంగుల్లో సెలక్ట్ చేసుకుంటున్నారని మరికొందరు చెబుతున్నారు. ఈ సెలక్షన్ పక్రియలో నలుపును ఎవరూ స్వీకరించడం లేదని వారు చెబుతున్నారు. గూగుల్ ప్రతినిధులు కూడా తమ గూగుల్ ఫిక్సల్ ఫోన్లలో కొత్తగా ఏదైనా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అది కలర్ కూడా కావచ్చని చెబుతున్నారు.

మరో టెక్ దిగ్గజం ఆపిల్ కూడా అదే దారిని ఆశ్రయిస్తోంది. గత నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్న ఐఫోన్లు  white, gold, rose gold and jet black రంగుల్లోనే వచ్చాయి. అయితే లేటెస్ట్ గా వచ్చిన  iPhone XR , iPhone 5C లు bold blue, yellow and coral రంగుల్లో వచ్చాయి. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఆపిల్ కంపెనీ రెడ్ ఎడిషన్ లో ఐఫోన్ ని విడుదల చేసిన సంగతి విదితమే. చైనా దిగ్గజం హువాయి కూడా తన ఫోన్లను వివిధ రంగుల్లో తీసుకువస్తోంది. ఆ కంపెనీ నుంచి వచ్చిన . Huawei's P20 Pro, Mate 20 Pro and Honor View 20లు కూడా వివిధ రకాల రంగుల్లో వచ్చాయి. 
 

జన రంజకమైన వార్తలు