సమ్మర్ సీజన్లో కూల్ ప్యాడ్ కూల్ గా తన కొత్త స్మార్టుఫోన్ ను లాంఛ్ చేయడానికి రెడీ అయింది. 'కూల్ ప్లే 6' పేరుతో ను ఈ నెల 16వ తేదీన చైనా మార్కెట్‌లో విడుదల చేయనుంది.
తొలుత చైనాలో రిలీజ్ చేసిన తరువాత మిగతా ప్రధాన మార్కెట్లకు దీన్ని అందుబాటులోకి తేవడానికి సంస్థ సన్నాహాలు మొదలుపెట్టింది. ఆ క్రమంలో జూన్ లో మరిన్ని దేశాల్లో ఇది లాంఛ్ చేస్తారని భావిస్తున్నారు. భారత్‌లో ఈ ఫోన్ రూ.14వేల ధరకు లభ్యం కానుంది.
ఏకంగా 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీతో ఈ ఫోన్ ను అందిస్తోంది. పైగా వెనుక వైపు రెండు కెమేరాలున్నాయి. రెండూ 13 మెగా పిక్సెళ్లవి. ఈ ఫీచర్ల దృష్ట్యా రూ.14 వేల ధర అంటే తక్కువనే చెప్పొచ్చు.
స్పెసిఫికేషన్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 653 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్
13, 13 డ్యుయల్ రియర్ కెమెరాలు
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4060 ఎంఏహెచ్ బ్యాటరీ