• తాజా వార్తలు

ప్రివ్యూ - లాప్ టాప్ లు గాడ్జెట్ లు పోతే వెంటనే ట్రాక్ చేసే డిజి టెక్ డివైస్

పోయిన స్మార్ట్ ఫోన్ లను ట్రేస్ చేయడానికి అనేక యాప్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే లాప్ ట్యాప్ లు ఇతరత్రా గాడ్జెట్ లు ఏవైనా మిస్ అయినపుడు వాటి యొక్క సరైన లొకేషన్ ను ట్రేస్ చేయడం లో వీటి పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. ఒక్కోసారి ఈ యాప్ లు ఎందుకూ పనిచేయవు కూడా. ప్రముఖ యాక్సేసరీల బ్రాండ్ అయిన డిజి టెక్ రూ 595/-ల ధరలో ఒక యాంటి లాస్ట్ వైర్ లెస్ ట్రాకర్ ను లాంచ్ చేసింది. ల్యాప్ టాప్ లు మరియు ఇతర గాడ్జెట్ లు మిస్ అయినపుడు వాటిని ట్రాక్ చేయడం లో ఇది ఉపయోగపడుతుంది. ఈ ట్రాకర్ డిజి టెక్ ట్రాకర్ ఈ ఒక యాప్ తో పెయిర్ చేయబడి ఉంటుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ రెండింటికి  అందుబాటులో ఉంటుంది.

ఈ ట్రాకర్ నలుపు మరియు తెలుపు రంగులలో మూడు డిజైన్ లలో అందుబాటులో ఉంటుంది. దీనిని లాప్ టాప్ పై ఫిక్స్ చేసుకోవచ్చు, వ్యాలెట్ లో పెట్టుకోవచ్చు లేదా కీ చైన్ కు కూడా తగిలించుకోవచ్చు. ఇది 4.0 బ్లూ టూత్ మరియు ఒక అదనపు సెట్ బ్యాటరీ తో లభిస్తుంది.

ఈ ట్రాకర్ ను పార్కింగ్ లో పార్క్ చేసిన కార్ కు సెక్యూర్ గా కూడా ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే ఇన్ బిల్ట్ అలారమ్ ను ట్రిగ్గర్ చేయడం ద్వారా ఇది కార్ ను డిటెక్ట్ చేస్తుంది. దీనియొక్క గరిష్ట రేంజ్ 30 మీటర్ ల వరకూ ఉంటుంది. మీ వస్తువులు ఈ రేంజ్ దాటి బయటకు వెళ్ళినపుడు మీ ఫోన్ రింగ్ అయ్యే విధంగా ఇందులో సెట్టింగ్ ఉంటుంది. ఈ సెట్టింగ్ ను మీ అవసరానికి తగ్గట్లు మీరు మార్చుకోవచ్చు. మీ మొబైల్స్ ద్వారా ఫోటో లు తీసే ఆప్షన్ ను కూడా ఈ యాప్ అందిస్తుంది. దీనికోసం ఈ డిజి ట్రాకర్ పై ఉండే బటన్ ను ప్రెస్ చేయవలసి ఉంటుంది.

ఈ డివైస్ ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫాం లైన అమజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ మరియు షాప్ క్లూస్ లతో పాటు ఆఫ్ లైన్ లో రిటైల్  స్టోర్ లలో కూడా అందుబాటులో ఉంటుంది.

జన రంజకమైన వార్తలు