యాపిల్ వాచ్.. యూత్‌కు చాలా క్రేజ్ ఇదంటే. యాపిల్ ఫోన్‌తో పాటు యాపిల్ వాచ్ కూడా బాగా ఫేమస్ అయింది. ఎందుకంటే దీనిలో ఉన్న ఫీచర్లు అలాంటివి. యూఎస్ లాంటి దేశాల్లోనే కాదు ఇప్పుడు భారత్‌లోనూ యాపిల్ హవా నడుస్తోంది. అయితే ఆ సంస్థ తెచ్చిన ఇ-సిమ్ టెక్నాలజీపై సర్వత్రా ఆసక్తి రేగుతోంది. అందులోనూ యాపిల్ వాచ్ ద్వారా ఇ-సిమ్ టెక్నాలజీని వాడే అవకాశం ఉండడం ఇక్కడ మరో విశేషం. అయితే యాపిల్ వాచ్‌తో ఇ-సిమ్ టెక్నాలజీని ఉపయోగించేది ఎలా? .. ఏంటి దీని వల్ల ఉపయోగాలు?
భారత్‌లో తొలిసారి...
యాపిల్ కంపెనీ సెల్యులర్ ఎల్‌టీఈ వెర్షన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అది కూడా యాపిల్ వాచ్ సిరీస్ 3 ద్వారా. సెల్యులర్ యాపిల్ వాచ్ భారత్‌లో రిలయన్స్, భారతి ఎయిర్‌టెల్ సర్వీసు ప్రొవైడర్ల ద్వారా ముందుకొస్తుంది. అయితే భారతి ఎయిర్‌టెల్ యునిఫైడ్ లైసెన్స్ కండిషన్ నిబంధలను ఉల్లఘించిందని ఇటీవలే డీవోటీకి రిలయన్స్ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండింట్లో ఏ కంపెనీ యాపిల్ వాచ్ సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుందో చూడాలి.
ఇ-సిమ్ అంటే...
యాపిల్ వాచ్ ద్వారా రాబోతున్న ఇ-సిమ్ టెక్నాలజీ అంటే ఏమిటి.. అంటే యాపిల్ ఫోన్‌తో సంబంధం లేకుండా యాపిల్ వాచ్ నేరుగా సెల్యులర్ సేవలు అందిస్తుంది. టెలికాం ఆపరేటర్ సర్వీసులను యాక్సెస్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఫోన్ నంబర్‌కు ఎక్స్ టెన్షన్. ఈ వాచ్‌ను నెట్‌వర్క్‌తో పెయిరింగ్ చేయిస్తే చాలు ఆటోమెటిక్‌గా ఫోన్‌లాగే పని చేస్తుంది.. ఇదే ఇ-సిమ్ టెక్నాలజీ గొప్పతనం. కాల్స్ చేసుకోవడం, డేటా ఉపయోగించుకోవడం, మ్యూజిక్ వినడం, క్యాబ్ బుక్ చేయడం ఇలా ఏ సర్వీసునైనా ఉపయోగించుకోవచ్చు.
ఎలా ఉపయోగించాలి..
మిగిలిన ఫోన్ల మాదిరిగా సిమ్‌లను మార్చుకోవడం లాంటి ఆప్షన్ ఇందులో ఉండదు. అందులో సిమ్ అలాగే ఉంటుంది,. దీనిలో ఉండే ఇన్‌బిల్ట్ యాంటినా ద్వారా యూనివర్సల్ మొబైల్ టెలి కమ్యునికేషన్స్ సిస్టమ్ (యూఎంటీఎస్) వాచ్ పని చేస్తుంది. ఇది ఇంటర్నేషనల్ మొబైల్ సబ్‌స్కైబర్ ఐడింటిటీని స్టోర్ చేస్తుంది. మీ ఫోన్‌లో ఛార్జింగ్ లేకపోయినా లేదా ఏదైనా సిగ్నల్ ప్రాబ్లమ్ ఉన్నా ఆ కాల్‌ను మీ వాచ్‌కు డైవర్ట్ చేస్తుది ఈ సిస్టమ్.