• తాజా వార్తలు

ప్రివ్యూ - టిక్‌టాక్‌కు పోటీగా ఫేస్‌బుక్‌ యాప్ ?!

టిక్‌టాక్‌ ఇప్పుడు ఎవర్నీ అడిగినా ఈ పేరు టకీమని చెప్పేస్తారు. యూల్ అయితే దీనికి ఎంతలా బానిసలయ్యారంటే చెప్పనే అవసరం లేదు. ఇదొక వ్యసనంలా మారింది. అలాగే చాలామంది జీవితాలను చిన్నా భిన్నం చేసింది. ఇప్పుడు దీనికి పోటీగా మరో యాప్ రాబోతోంది. వాట్సప్, ఫేస్‌బుక్‌లను ఎక్కువగా వాడేవారు చాలామందే ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టిక్‌టాక్ నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఫేస్‌బుక్ కూడా త్వరలోనే టిక్‌టాక్‌ను పోలిన యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిసింది. 

టిక్‌టాక్ యాప్‌కు లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఫేస్‌బుక్ కూడా సరిగ్గా అలాంటి ఓ యాప్‌నే ప్రస్తుతం డెవలప్ చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఒకప్పుడు గూగుల్, ట్విట్టర్ లాంటి కంపెనీల్లో పనిచేసిన టాఫ్స్ ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన సారథ్యంలో కొత్తగా యూఎక్స్ డిజైనర్లు, ఇంజినీర్లను రిక్రూట్ చేసుకుంటున్నారట.

అందుకని అతి త్వరలోనే ఈయన సారథ్యంలో ఫేస్‌బుక్.. టిక్‌టాక్‌ను పోలిన యాప్‌ను విడుదల చేస్తుందని తెలిసింది. మరి ఫేస్‌బుక్ తెచ్చే ఆ నూతన యాప్ ఎప్పుడు యూజర్లకు లభిస్తుందో, అది ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..!

ఇదిలా ఉంటే ఓ బాలిక టిక్‌టాక్‌లో వీడియో కోసం సీలింగ్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాలని యత్నించింది. కానీ ఆ ప్రయోగం విఫలమై.. చివరకు ఆమె ప్రాణాల మీదకు వచ్చింది. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు చూశారు కాబట్టి సరిపోయింది.. లేకపోతే ప్రాణాలు పోయుండేవి.. తల్లిదండ్రులు ఇకనైనా తమ పిల్లలు స్మార్ట్‌ఫోన్లలో ఏం చేస్తున్నారో, సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారో కచ్చితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు..!

జన రంజకమైన వార్తలు