గూగుల్ సంస్థ మరో సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)ను మార్కెట్లోకి తీసుకురావడానికి ఏర్పాట్లు వేగవంతం చేస్తోంది. తన సరికొత్త ఓఎస్ ఫ్యూషా(fuchsia)ను సరికొత్త డిజైన్లలో రూపొందిస్తోంది. ఏడాది కిందటే ఈ ప్రాజెక్టు వేగవంతం అందుకున్నా ప్రస్తుతం ఇది తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
గూగుల్ కు ఇప్పటికే క్రోమ్, ఆండ్రాయిడ్ ఓఎస్ లు ఉన్నాయి. ఈ రెండు ఓఎస్‌లు కూడా లినెక్స్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి పరిచినవి.
పైగా క్రోమ్ డెస్కుటాప్ లలో... ఆండ్రాయిడ్ స్మార్టు ఫోన్లు, ట్యాబ్లెట్లలో పనిచేస్తుంది. ఇలా విడివిడి గా కాకుండా ఇంటర్‌నెట్ ఆధారిత అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో పని చేసేలా గూగుల్ ఫ్యూషా ఓఎస్ కు రూపమిస్తోంది. ఫ్యూషా అందుబాటు లోకి వస్తే 'క్రోమ్'కు పూర్తిగా గుడ్‌బై చెప్పాలని... ఆండ్రాయిడ్ ను కూడా దీంతో రీప్లేస్ చేయాలని గూగుల్ ప్లాన్ చేస్తోందట.
రియల్ టైం ఆపరేటింగ్ సిస్టమ్
ఫ్యూషా అనేది రియల్ టైం ఆపరేటింగ్ సిస్టమ్. అంతేకాదు, ఇది యూనివర్సల్ ఓఎస్. అంటే ఎంబడెడ్ సిస్టమ్స్ మొదలుకుని స్మార్టుఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్ లు, ఇతర అన్ని ఇంటర్నెట్ బేస్డ్ గాడ్జెట్లన్నిటిలోనూ పనిచేస్తుంది.
ఆర్మడిల్లో ఇంటర్ ఫేస్ తో..
దీని ఇంటర్ ఫేస్ ను సరికొత్తగా డిజైన్ చేస్తున్నారు. ఆర్మడిల్లో పేరుతో ఈ ఇంటర్ ఫేస్ డెవలప్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ లో లేని ఎన్నో సౌలభ్యాలు ఇందులో తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఫ్యూషా అంటే...
నిజానికి ఫ్యూషా అనేది ఒక రంగు పేరు. ఎరుపు, గులాబీ రంగుల మిశ్రమాన్ని ఫ్యూషా అంటారు. ఇది మెజెంటా రంగుకు దగ్గర్లో ఉంటుంది. ఈ కొత్త ఓఎస్ కు ఇదే పేరు పెట్టారు.