హార్ట్ ఎటాక్.. ఎప్పుడు, ఏ సమయంలో మనపై దాడి చేస్తుందో తెలియదు! వచ్చిందంటే మనిషిని ఉన్న స్థలంలోనే కుంగ దీసేస్తుంది! మన పరిస్థితిని గమనించి ఎవరైనా వైద్యులకు సమాచారమిస్తే ప్రాణాలు రక్షించుకునే అవకాశం ఉంది! ఒక్కోసారి ఎవరూ గమనించకపోతే ఏం చేయాలి? `నేను ప్రమాదంలో ఉన్నాను` అనే సమాచారాన్ని కుటుంబసభ్యులకో, మిత్రులకో చెప్పాలనిపిస్తుంది. కానీ సెకన్లు గడుస్తున్న కొద్దీ మరింత ప్రమాదకరంగా పరిస్థితి మారిపోతుంది! ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల నుంచి మనల్ని రక్షిస్తుంది Rescuer యాప్. మనకు హార్ట్ ఎటాక్ రాగానే ఈ యాప్ ఓపెన్ చేసి.. చిన్న చిన్న సంకేతాలు ఇస్తే చాలు.. మనం ఆపదలో ఉన్నామనే సమాచారాన్ని మిత్రులు, కుటుంబసభ్యులకు వెంటనే తెలియజేస్తుంది.
ఎలా పనిచేస్తుంది?
ఆకస్మికంగా మనపై దాడిచేసే వాటిలో హార్ట్ ఎటాక్ ఒకటి! అటువంటి అత్యవసర సమయంలో మన లొకేషన్, మాటలు, ఫొటోలు వంటి సమాచారాన్ని సెకన్లలో కుటుంబసభ్యులు, మిత్రులకు పంపించి వారిని అలర్ట్ చేసి మన ప్రాణాలు కాపాడే యాప్ ఈ Rescuer. పేరుకు తగ్గట్టుగానే ఇది పనిచేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో మూడు రకాల ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
Voice recognition
ముందుగా మనం ఒక కీ ఫ్రేజ్(కొన్ని మాటలు) ఈ యాప్‌లో చెప్పాల్సి ఉంటుంది. వీటి ద్వారా మన వాయిస్‌ను ఈ యాప్ గుర్తిస్తుంది. వీటితో పాటు మనం ఆపదలో ఉన్న విషయాన్ని ఎవరికి చెప్పాలనుకుంటామో.. వారి కాంటాక్ట్‌ని కూడా ముందుగానే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ హార్ట్ ఎటాక్ లేదా ఇతర ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే మనం మాట్లాడితే చాలు ఫోన్ లాక్ అయి ఉన్నా, వేరే గదిలో ఉన్నా మన వాయిస్‌ను యాప్ గుర్తించి ముందుగా యాడ్ చేసిన కాంటాక్ట్ పర్సన్‌కి అత్యవసర మెసేజ్‌ను పంపిస్తుంది. దీంతో పాటు ఫొటోలు వంటివి కూడా జీపీఎస్ సాయంతో చేరవేస్తుంది.
Volume button toggle
మనం పైకి మాట్లాడలేకుండా ఉన్న సమయంలో ఫోన్‌కి ఉండే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్‌ని ఉపయోగించి కూడా అత్యవసర మెసేజ్‌ని పంపించుకోవచ్చు. వీటితో పాటు ఫొటోలు కూడా పంపే సదుపాయం ఉంది.
Remote Location Tracking
ఆపదలో ఉండి మన లొకేషన్ చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే... ఎదుటి వారు మనమెక్కడ ఉన్నామో తెలుసుకునే ఫీచర్ కూడా ఇందులో ఉంది. అవతలి వ్యక్తి మన రెస్క్యూయర్‌కి మెసేజ్ పంపితే చాలు.. మనం ఉన్న లొకేషన్‌ను వారికి ఈ యాప్ పంపుతుంది.