• తాజా వార్తలు

ప్రివ్యూ- అజ్ఞాత‌వాసిలా ఉంటూనే అంద‌రి ఫీడ్‌బ్యాక్ తెలుసుకునే ప‌వ‌ర్‌ఫుల్ యాప్ SAYAT

మన గురించి ఎదుటి వారు ఏమ‌నుకుంటున్నారు అనే సందేహం ఏదో ఒక సంద‌ర్భంలో వ‌స్తూనే ఉంటుంది. సోష‌ల్ మీడియాలో ఉన్న‌ స్నేహితుల నుంచి ఎటువంటి దాప‌రికాలు లేకుండా, నిజాయితీ గ‌ల ఫీడ్‌బ్యాక్‌ను ర‌హ‌స్యంగా సేక‌రించేందుకు, వేరొక‌రి గురించి మన అభిప్రాయాలు నిర్భ‌యంగా తెలిపేందుకు ఏదైనా యాప్ అందుబాటులో ఉంటే బాగుంటుంద‌ని ఎప్పుడైనా అనుకున్నారా? అలాంటి యాప్స్ ఇంత‌వ‌ర‌కూ మీ దృష్టికి రాలేదా? అయితే మీరు క‌చ్చితంగా Sayat అనే ప‌వ‌ర్‌ఫుల్‌ ఆండ్రాయిడ్ యాప్ గురించి తెలుసుకోవాల్సిందే! 

డెస్క్‌టాప్‌, యాప్‌లోనూ.. 
ప్ర‌స్తుతం ఎంతోమంది ఈ ఆండ్రాయిడ్ యాప్‌ను ఉప‌యోగిస్తున్నారు. అయితే క‌మీడియ‌న్ కెన్నీ సెబాస్టియ‌న్‌తో పాటు కామెడీ గ్రూప్‌ AIB.. త‌మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ లింక్ షేర్ చేసిన త‌ర్వాత‌.. మ‌న దేశంలో బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ యాప్‌ ఆండ్రాయిడ్ యూజర్ల‌కి మాత్ర‌మే అందుబాటులో ఉంది. ఇది కంప్యూట‌ర్, స్మార్ట్‌ఫోన్‌లోనూ  ప‌నిచేస్తుంది. యాప్‌ను ప్లేస్టోర్ నుంచి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇందులో ముందుగా మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీని కోసం కంప్యూట‌ర్‌లోని బ్రౌజ‌ర్ ఓపెన్ చేసి.. అందులో Sayat.me అని టైప్ చేయాలి. ఇందులో యూజ‌ర్‌నేమ్‌, పాస్‌వ‌ర్డ్ సెట్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. త‌ర్వాత‌ లాగిన్ అయితే మ‌న హోమ్ పేజ్ క‌నిపిస్తుంది. ఇందులో Public, Received, Sent, Friends అనే ఆప్ష‌న్స్ క‌నిపిస్తూ ఉంటాయి. యాప్ ఉప‌యోగిస్తే.. ప్రొఫైల్ పిక్చ‌ర్‌తో పాటు ఫ్రెండ్స్‌ను కూడా యాడ్ చేసుకోవ‌చ్చు. వ‌ర్కింగ్ ఈమెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట‌ర్ అవ్వాల్సి ఉంటుంది. 

వివ‌రాలు మాత్రం గోప్యం
ఇందులో ముందుగా మ‌న గురించి స్నేహితుల‌ను ఏఏ అంశాలు అడ‌గాల‌ని అనుకుంటున్నామో.. వాటికి సంబంధించిన‌ కొన్ని ప్ర‌శ్న‌లు త‌యారుచేసుకోవాలి. “Describe me with a few words”, “What was your first impression of me” అనే ప్ర‌శ్న‌ల‌తో పాటు మ‌రికొన్ని డిఫాల్ట్‌గా ఉంటాయి. మ‌నకు ఇవి న‌చ్చ‌క‌పోతే.. మ‌నం సొంతంగా కొన్ని ప్ర‌శ్న‌లు రూపొందించుకునే అవ‌కాశం కూడా ఉంది. మొత్తం ఇలా క్రియేట్ చేసుకున్నాక‌.. ఈ Sayat.me లింక్‌ని ఫేస్‌బుక్, ట్విట‌ర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోష‌ల్ మీడియా స‌ర్వీసులో స్నేహితుల‌కి షేర్ చేస్తే చాలు. వారు దీనిని క్లిక్ చేసి ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌ను.. సేక‌రించి హోమ్ స్క్రీన్‌పై క‌నిపిచ్చేలా చేస్తుంది. ఇదంతా చాలా ర‌హ‌స్యంగా జ‌రుగుతుంది. ఈ లింక్ మ‌నం పంపినా.. దీనిని ఎవ‌రు పంపించారు, ఎక్క‌డి నుంచి వ‌చ్చింద‌నే వివ‌రాలేవీ ఫ్రెండ్స్‌కి తెలిసే అవ‌కాశ‌మే ఉండ‌దు. Sarahah అనే ఆండ్రాయిడ్ యాప్‌ను కూడా ఎదుటి వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తెలుసుకునేందుకే రూపొందించారు. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు, హింసించ‌డం వంటి అంశాల‌పై ర‌హ‌స్యంగా ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు ఉప‌యోగించేవారు.

 

జన రంజకమైన వార్తలు