చైనా మొబైల్ తయారీ సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ 'హానర్ 8 లైట్'ను ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేయడానికి రెడీ అయిపోయింది. గురువారం (11 మే) దీన్ని విడుదల చేస్తుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. చాలాకాలంగా దీనిపై స్పెక్యులేషన్ నడుస్తున్నా కూడా తాజాగా మూడు రోజుల్లో పెద్ద సర్ప్రైజ్ అంటూ హానర్ ఇండియా ట్విట్టర్ లో వెల్లడించడంతో మరోసారి ఇది వార్తల్లో నిలిచింది. హానర్ ఇండియా ట్వీట్ తో దీన్ని గురువారం లాంచ్ చేస్తారన్న ప్రచారం స్పీడందుకుంది.
దీని ఫీచర్లు, ధర, లాంచింగ్ పై కచ్చితమైన వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అంచనాలు మాత్రం వెలువడుతున్నాయి.బ్లూ,గోల్డ్, వైట్ అండ్ బ్లాక్ కలర్స్‌లో ఈ డివైస్‌ను అందుబాటులోకి తేనుంది. దీని ధర రూ. 17,999గా నిర్ణయించినట్టు సమాచారం.
హానర్ 8 లైట్ ఫీచర్ల అంచనాలివీ..
5.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్,
4 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.1
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్లో వినియోగదారులకు లభ్యం కానుందని తెలుస్తోంది.