• తాజా వార్తలు

త్వరలో ఆండ్రాయిడ్ నూగాట్ తో హువావే నుంచి కొత్త ఫోన్.. ఏ7


చైనాకు చెందిన స్మార్టు ఫోన్ మేకర్ హువావే తన నూతన మోడల్ ను త్వరలో లాంచ్ చేయబోతోంది. వై7 పేరిట విడుదల చేయనున్న దీని ధర ఇంకా వెల్లడించనప్పటికీ ఫీచర్స్ ఆధారంగా బడ్జెట్ ఫోన్ గానే తెలుస్తోంది. హువావే చాలాకాలంగా ఇండియన్ మార్కెట్లో పట్టుకోసం ప్రయత్నిస్తున్నా ఇంకా మెయిన్ ప్లేయర్ కాలేకపోతుంది. కొత్తగా రిలీజ్ చేయనున్న ఫోన్ తో ఆ ఆశ తీర్చుకోవాలని ప్రయత్నిస్తోంది.

హువావే వై 7 స్పెసిఫికేషన్లు



5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

జన రంజకమైన వార్తలు