• తాజా వార్తలు

ఏంటి ఈ ఎల్‌జీ స్మార్ట్ పెన్‌? స‌్మార్ట్‌ఫోన్‌నే రీప్లేస్ చేస్తుందా? చెవిలో పువ్వా? నిజమా?

టెక్నాల‌జీ రంగంలో కొన్ని ఆవిష్క‌ర‌ణ‌ల గురించి వింటే ఇది సాధ్య‌మేనా? ఇదెలా అవుతుంది? అనే సందేహాలు వ‌స్తూ ఉంటాయి. ప్రస్తుతం ఎల్‌జీ విడుద‌ల చేసిన `స్మార్ట్‌పెన్` గురించి విన్న వారు, ఫొటోలు చూసిన వారు ఇదే ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది స్మార్ట్‌ఫోన్‌ని కూడా రీప్లేస్ చేసేస్తుంద‌ని ఎల్‌జీ చెప్ప‌డంతో ఎన్నో డౌట్లు దీని గురించి వినిపిస్తున్నాయి. 

పెన్ లాంటి స్మార్ట్‌ఫోన్‌
ఒక పెన్‌.. స్మార్ట్‌ఫోన్‌లా ప‌నిచేయ‌గ‌ల‌దా? మార‌గ‌ల‌దా? ప‌్ర‌శ్న‌లే చాలా కొత్త‌గా ఉన్నాయి క‌దూ! మ‌రి స్మార్ట్‌ఫోన్‌లా మారే పెన్నును చూస్తే ఇంకేమంటారో? అవును స్మార్ట్‌ఫోన్‌లా మారిపోయే పెన్‌ను ఎల్‌జీ కంపెనీ రూపొందిస్తోంది. ఒక పేటెంట్‌ను ఫైల్ చేసింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. 

ఫీచ‌ర్లు చాలానే ఉన్నాయి..
ఇందులో రెండు డిస్ల్పేలు ఉంటాయి. చిన్నగా క‌నిపించే స్క్రీన్‌పై టైమ్‌తో పాటు నోటిఫికేష‌న్స్, యాప్ షార్ట్‌క‌ట్స్ క‌నిపిస్తుంటాయి. మ‌రో డిస్ల్పే పెన్‌ లోప‌ల‌కు రోల్ చేసి ఉంటుంది. అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో పెన్‌కు ఇచ్చిన చిన్న బ‌ట‌న్ నొక్కితే ఇది బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇక‌ స్మార్ట్‌ఫోన్‌లో వినియోగించే యాప్స్ అన్నీ ఇందులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప‌నిచేస్తాయ‌ట‌. స్మార్ట్‌ ఫోన్‌లో ఉన్న గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ, కెమెరా, ఐట్రాకింగ్ వంటి సెన్స‌ర్ల‌తో పాటు ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ కూడా ఇందులో ఉంటాయ‌ట‌. మొబైల్ ఫోన్స్‌, ట్యాబ్లెట్ వంటి వాటికి బ్లూటూత్ ద్వారా క‌నెక్ట్ చేయ‌వ‌చ్చు. ఇందులో మైక్రోఫోన్‌, ఇయ‌ర్ ఫోన్ వంటివి కూడా ఉండ‌బోతున్నాయ‌ట‌. దీనిద్వారా కాల్స్ కూడా చేసుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు