భవిష్యత్‌లో రాబోయే టెక్నాలజీ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఆధారపడి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ టెక్నాలజీ ఉపయోగించి స్మార్ట్‌ఫోన్లలో ప్రత్యేక ఫీచర్లు ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్‌జీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే తొలి స్మార్ట్ టీవీని రూపొందించింది. ఇవి రూ.32,500 నుంచి రూ.29,49,990 వరకూ అందుబాటులో ఉన్నాయి. OLED, Super UHD, UHD డిస్ల్పేలు గల 25 టీవీలను మార్కెట్‌లోకి విడుదల చేసింది.
ఎన్నో ఫీచర్లు..
ఈ స్మార్ట్ టీవీ.. webOS మీద ఆధారపడి పనిచేస్తుంది. Alpha 7, Alpha 9 processors ఇందులో అమర్చారు. webOS, వాయిస్ కంట్రోల్, డాల్బీ అట్మాస్, మొబైల్ కనెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 32 అంగుళాల నుంచి మొదలై 77 అంగుళాల పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో మ్యాజిక్ రిమోట్ ఫీచర్ ఉంది. దీనిని మౌస్‌లా కూడా ఉపయోగిం చుకోవచ్చు. దీనిలో మైక్రోఫోన్ కూడా అమర్చారు. దీని ద్వారా దాదాపు 800 వాయిస్ కమాండ్లు ఇవ్వొచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేని సమయంలోనూ ఇవి పనిచేస్తాయి. అంతేగాక ఈ టీవీని గేమింగ్ పరికరాలకు కూడా అనుసంధానం చేసుకోవచ్చు. గూగుల్ ఫొటోస్, గూగుల్ డ్రైవ్ వంటి సర్వీసులు webOS సాయంతో సులువుగా పనిచేస్తాయి. బ్లూటూత్‌ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. HDR, Dolby Vision, advanced HDR, HDR10 Pro, and HLG Pro వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు సపోర్ట్ చేస్తాయి. ఇందులో ఉండే ఆల్ఫా ప్రాసెసర్లు పిక్చర్ క్వాలిటీ మరింత పెంచుతాయి. 120 ఫ్రేమ్స్ ఫర్ సెకండ్ వరకూ సపోర్ట్ చేస్తుంది. దీంతో ప్రతి కలర్ అద్భుతంగా కనిపిస్తుంది. SuperUHD TV.. 4K వీడియో క్వాలిటీని సపోర్ట్ చేస్తుంది. Alpha 7 processor, Dolby Atmos, and ThinQ AI వంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.